Slum Dog Husband film review: ఈ సినిమా ముందు కుర్చీల్లో కూర్చున్న వాళ్ళ కోసమే !

ABN , First Publish Date - 2023-07-29T14:27:29+05:30 IST

సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన 'స్లమ్ డాగ్ హజ్బెండ్' ఈరోజు విడుదలైంది. పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దీనికి దర్శకుడు, ఇది అతని తొలి సినిమా. కుక్కని పెళ్లి చేసుకున్న కథానాయకుడి జీవితం ఎటువంటి మలుపులు తిరిగిందో ఈ సినిమా లో చూద్దాం.

Slum Dog Husband film review: ఈ సినిమా ముందు కుర్చీల్లో కూర్చున్న వాళ్ళ కోసమే !
Slum Dog Husband Review

సినిమా: స్లమ్ డాగ్ హజ్బెండ్

నటీనటులు: సంజయ్ రావు (SajayRao), ప్రణవి మానుకొండ (PranaviManukonda), ఫిష్ వెంకట్ (FishVenkat), బ్రహ్మాజీ (Brahmaji), సప్తగిరి (Saptagiri), యాదమ్మ రాజు (YadammaRaju), మురళీధర్ గౌడ్ (MuralidharGoud), వేణు పొలసాని తదితరులు

ఛాయాగ్రహణం: శ్రీనివాస్ రెడ్డి

సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)

నిర్మాత: అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి (AppiReddy)

రచన, దర్శకత్వం: డాక్టర్ ఏఆర్ శ్రీధర్ (Dr AR Sridhar)

-- సురేష్ కవిరాయని

సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పిలవబడ్డాడు. అతని కుమారుడు సంజయ్ రావ్ (SanjayRao) 'పిట్టకథ' #Pittakatha సినిమాతో మూడు సంవత్సరాల క్రితం పరిశ్రమలోకి అడుగు పెట్టాడు, ఇపుడు మళ్ళీ అతను లీడ్ యాక్టర్ గా నటించిన 'స్లమ్ డాగ్ హజ్బెండ్' #SlumdogHusbandReview సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి జగన్నాథ్ (PuriJagannadh) దగ్గర పని చేసిన డాక్టర్ ఏఆర్ శ్రీధర్ (DrARSridhar) ఈ సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తుండగా, బాలనటిగా కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించిన ప్రణవి మానుకొండ (Pranavi Manukonda) ఈ సినిమాతో కథానాయికగా అడుగు పెడుతోంది. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ సినిమాకి నిర్మాతలు, కాగా ఈ సినిమా కథా నేపథ్యం కథానాయకుడికి కుక్కతో పెళ్లి జరగటం, ఆ పెళ్లి తరువాత ఏమి జరిగింది అనే విషయం మీద ఉంటుంది అని ముందుగానే చెప్పారు. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

slumgdoghusband1.jpg

Slum Dog Husband story కథ:

లచ్చి లేదా లక్ష్మణ్ (సంజయ్ రావ్) పార్శీగుట్టలో రోడ్ మీద కళ్లద్దాలు అమ్ముకునే ఒక కుర్రాడు. అదే పేటలో వున్న మౌనిక (ప్రణవి మానుకొండ)తో ప్రేమలో ఉంటూ, ఎప్పుడూ ఫోనులో ఆమెతో రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆలా మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో తల్లి తిడుతూ ఉంటుంది, బయట పోలీసులు తిడతారు, ఇక లాభం లేదనుకుని మౌనికని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. రెండు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్ధం జరిగే రోజు ముహూర్తం పెట్టడానికి పుట్టిన తేదీ అడిగితే, ఇద్దరివీ తెలీదు అంటారు. ఇక ఆ పూజారి పుట్టిన తేదీలు తెలియవు, జాతకాలు చూడటం అవదు కాబట్టి దోషం పోవటానికి ముందుగా అబ్బాయికి ఒక కుక్కతో పెళ్లి జరిపించండి అంటే, లచ్చిగాడికి బేబీ అనే కుక్కతో ధూమ్ ధామ్ గా పెళ్లి జరుగుతుంది. #SlumdogHusbandReview వారం తరువాత లచ్చిగాడు, మౌనికల పెళ్లి జరుగుతూ ఉంటుంది, తాళి కట్టే సమయానికి పోలీస్ లు వచ్చి లచ్చిగాడిని అరెస్టు చేస్తారు. ఎందుకు అంటే కుక్కకి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నందుకు అని చెప్తారు. ఇంతకీ కుక్కని వివాహం చేసుకోవటం నేరమా? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? లచ్చికి మౌనికకి వివాహం జరిగిందా? కోర్ట్ ఏమి చెప్పింది? చివరికి ఏమైంది ఇవన్నీ తెలియాలంటే ఈ 'స్లమ్ డాగ్ హజ్బెండ్' సినిమా చూడాల్సిందే.

slumgdoghusband3.jpg

విశ్లేషణ:

ముందుగా ఈ 'స్లమ్ డాగ్ హజ్బెండ్' #SlumdogHusbandReview అనే సినిమా క్లాస్ ప్రేక్షకులకి కాదని ట్రైలర్ చూస్తేనే అర్థం అయిపోతుంది, సినిమా చూసాక అలాగే అనిపిస్తుంది. ఇది కొంచెం 'డీజే టిల్లు' #DJTillu స్టైల్ లో తీసారు అనిపిస్తుంది. ఎందుకంటే పార్సీగుట్టలో జరిగిన కథ, దానికి వారాసిగూడ, చిలకల గూడా లాంటి చాలా బస్తీల పేర్లు కూడా జతచెయ్యడంతో ఇది ఒక బస్తీలో కథ అని అర్థం అయిపోతుంది. ఇందులో పాటలు కూడా చాలా మాసీ గా వుండి అవి కేవలం ముందు బెంచిలో కూర్చున్న వాళ్ళు గెంతుతారు అని కూడా తెలిసిపోతుంది. అందుకే దర్శకుడు శ్రీధర్ కేవలం ఈ సినిమాని మాస్ ప్రేక్షకులకు అలరించడానికి మాత్రమే తీసినట్టుగా కనపడింది. ఈ సినిమాలో మాటలు, సన్నివేశాలు, పాటలు, డాన్సులు అన్నీ కూడా మాస్ ప్రేక్షకులని అలరించడానికి ఉపయోగపడతాయి. ఇది క్లాస్ ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు, నచ్చదు కూడా.

కుక్కతో పెళ్లి అవటం, ఆ తరువాత ఆ కుక్కకి విడాకులు ఇచ్చాక వేరే పెళ్లి చేసుకోవాలి అని చెప్పడం ఇవన్నీ కొంచెం సరదాగానే తీశారు. ఈ విడాకుల కేసు కోర్ట్ కు వెళ్ళటం అక్కడ బ్రహ్మాజీ, సప్తగిరి ల మధ్య వాదనలు, ఫిష్ వెంకట్ జడ్జి గా మాట్లాడటం ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాలు వున్నా, అవి మరీ ఎక్కువవడంతో అందులో కొన్ని సాగదీయడంతో బోర్ కొట్టించాయి. అయితే ఇక్కడ కుక్కతో పెళ్లి అనే నేపథ్యం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. #SlumdogHusbandReview ఈ కాన్సెప్ట్ ని పట్టుకొని ఇంకా కొంచెం ఫన్, కామెడీ బాగా జనరేట్ చేయొచ్చు కానీ, దర్శకుడు అక్కడక్కడా మాత్రమే కొన్ని సన్నివేశాలు అలరించేట్టు చేసాడు. అయితే కేవలం మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే దర్శకుడు సన్నివేశాలను రాసుకున్నాడు అనిపిస్తుంది. #SlumdogHusbandReview దానికి తోడు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాటలు కూడా అలాగే వుండి, ఈ సినిమాకు అవి సహాయ పడ్డాయి అని చెప్పొచ్చు. రిట్రో సాంగ్ 'మౌనికా ఓ మై డార్లింగ్' తరహాలో ఒక పాట, 'లచ్చి గాని పెళ్లి' పాట బాగుంది, ఈ పాటలు ఇప్పటికే బాగా వైరల్ అయ్యాయి కూడా. కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల ఇప్పటి మాస్ కు అనుగుణంగా పాటలు రాశారు అనిపిస్తుంది. ఈ సినిమాకి ఛాయాగ్రహణం కూడా బాగా కుదిరింది.

slumgdoghusband2.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, సంజయ్ రావ్ కథానాయకుడిగా బాగా చేసాడు. అతను ఇంతకు ముందు 'పిట్టకథ' సినిమా చేసాడు, ఆ సినిమాకన్నా మెరుగ్గా ఇందులో కనిపించాడు, అలాగే క్లైమాక్స్ సన్నివేశంలో ముఖ్యంగా కోర్టులో భావోద్వేగ సన్నివేశంలో తన హావభావాలని బాగా చూపించాడు, పలికించాడు కూడా. కథానాయకురాలు ప్రణవి మానుకొండ కళ్ళతోనే హావభావాలు పలికించగల నటి. రిట్రో పాటలో డాన్సులు కూడా బాగా చెయ్యగలను అని చూపించింది. ఇంకో తెలుగు అమ్మాయి కథానాయకురాలిగా రావటం మంచిది, మంచి నటి అయ్యే అవకాశాలు వున్నాయి, మంచి భవిష్యత్తు వుంది. ఈ సినిమాలో సర్‌ప్రైజ్ ఏదైనా వుంది అంటే అది నటుడు యాదమ్మ రాజు (YadammaRaju). ఇతను సినిమా అంత సరదాగా కామెడీ సన్నివేశాల్లో కనపడతాడు, కానీ క్లైమాక్స్ లో మాత్రం ఆశ్చర్యపరుస్తాడు. సప్తగిరి, బ్రహ్మజీ (Brahmaji) రెండో సగం లో వచ్చి కొంచెం హాస్యం పండించారు, కానీ అనుకున్నంతగా ఉండదు. ఫిష్ వెంకట్ ని విలన్ పక్కన చాలా సినిమాల్లో చూసి, ఇందులో జడ్జి పాత్రలో చూడగానే వెరైటీగా కనపడ్డాడు. రఘు కారుమంచి, వేణు పొలసాని, మురళీధర్ గౌడ్ ఇంకా మరికొంతమంది నటీనటులు సపోర్ట్ చేశారు.

slumgdoghusband5.jpg

చివరగా, 'స్లమ్ డాగ్ హజ్బెండ్' అనే సినిమా క్లాస్ సినిమా ప్రేక్షకులకు మాత్రం కాదు, అలాగే మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు కూడా కాదు. ఇది కేవలం మాస్ ప్రేక్షకులకు, ముఖ్యంగా ముందు కూర్చున్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. సింగిల్ థియేటర్స్ లో ఈ సినిమా నడిచే అవకాశాలు మెండుగా ఉంటుంది, అక్కడ పైసా వసూల్ చిత్రం అని చెప్పొచ్చు. ఇందులో మాటలు క్లాస్ గా వుండవు, చాలా మాస్ గా ఉంటాయి, యువతకి ఎక్కుతుందేమో చూడాలి. తెలుగు నటీనటులు చాలామంది తెలుగు తెరకి పరిచయం అయ్యారు ఈ సినిమాతో, అది హర్షించదగ్గ విషయం.

Updated Date - 2023-07-29T22:27:48+05:30 IST