Shaakuntalam film review: కాళిదాసు కవిత్వం కొంతయితే...

ABN , First Publish Date - 2023-04-14T08:55:19+05:30 IST

మహాకవి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' కావ్యాన్ని దర్శకుడు గుణశేఖర్ 'శాకుంతలం' సినిమా గా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఈ సినిమా గురించి చాలా గొప్పగా గుణశేఖర్, నిర్మాత దిల్ రాజు మాట్లాడేరు. మరి ఈ సినిమా ఎలా వుందో....

Shaakuntalam film review: కాళిదాసు కవిత్వం కొంతయితే...

సినిమా: శాకుంతలం

నటీనటులు: స‌మంత, దేవ్ మోహ‌న్, మోహ‌న్ బాబు (Mohan Babu), శివ బాలాజీ (Siva Balaji), అల్లు అర్హ (Allu Arha), ప్ర‌కాష్‌ రాజ్‌, (Prakash Raj) మ‌ధుబాల‌ (Madhubala), గౌత‌మి, అన‌న్య నాగ‌ళ్ల‌ తదితరులు

మాటలు : సాయి మాధవ్ బుర్రా

పాటలు : చైతన్య ప్రసాద్, శ్రీమణి

ఛాయాగ్రహణం : శేఖర్ వి. జోసెఫ్

సంగీతం : మణిశర్మ (Mani Sharma)

నిర్మాత : నీలిమా గుణ (Neelima Guna)

దర్శకత్వం: గుణశేఖర్

-- సురేష్ కవిరాయని

దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar), నిర్మాత దిల్ రాజు (Dil Raju) కలిపి నిర్మించిన 'శాకుంతలం' (Shaakuntalam) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదొక పౌరాణిక సినిమా. ఇందులో శకుంతలాగా సమంత (Samatha Ruth Prabhu) నటించగా, దుష్యంతుడిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) నటించాడు. ఈ సినిమా భారతంలోని కథ అయినా, దర్శకుడు గుణశేఖర్ మహాకవి కాళిదాసు రచించిన (Mahakavi Kalidasu) 'అభిజ్ఞాన శాకుంతలం' (Abhijnana Shaakuntalam) నుండి ఈ సినిమాకి కావలసిన కథని తీసుకున్నాను అని చెప్పాడు. గుణశేఖర్ 'ఒక్కడు' (Okkadu), 'చూడాలని ఉంది' (Choodalani Vundi), 'సొగసు చూడతరమా' (Sogasu Chooda Tharama) ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసి తనదైన ముద్ర వేసుకున్నాడు. అలాగే సినిమా కథకి అవసరం అయిన భారీ సెట్స్ వేస్తాడని కూడా ప్రతీతి. ఇప్పుడు మహాకవి కాళిదాసు రచించిన ఈ ప్రేమ కావ్యాన్ని 'శాకుంతలం' (ShaakuntalamReview) గా తీసాడు. మరి ఈ సినిమా ఎలా వుందో, విషయం ఏంటో చూద్దాం.

shakuntalam-15.jpg

Shaakuntalam story కథ:

ఈ కథ ఏమి అంత తెలియంది కాదు, అందరికీ తెలిసిందే. విశ్వామిత్ర మహర్షి తపస్సును భంగం చేయడానికి దేవేంద్రుడు అప్సరస అయిన మేనకను పంపిస్తాడు, ఆ క్రమంలో మేనక, విశ్వామిత్రులు శారీరకంగా కలుస్తారు, ఒక పాప పుడుతుంది. ఆ పాపని మేనక భూలోకంలో వదిలి వెళ్ళిపోతుంది. పక్షులు తీసుకువెళ్లి కణ్వ మహర్షి ఆశ్రమంలో (ShaakuntalamFilmReview) వదిలేస్తాయి, కణ్వ మహర్షి ఆ పాపకి శకుంతల అని నామకరణం చేస్తాడు. శకుంతల పెద్దది (సమంత) అవుతుంది. ఒకనాడు దుష్యంత మహారాజు (దేవ్ మోహన్) వేటకు వచ్చి కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలను చూసి, మోహించి, ప్రేమలో పడి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. రాజ్యానికి వెళ్లి మేళ తాళాలతో తిరిగి వచ్చి శకుంతలను తీసుకొని వెళ్తానంటాడు. ఈలోపు శకుంతల గర్భవతి అవుతుంది. కణ్వ మహర్షి శకుంతలను దుష్యంత మహారాజు రాజ్యానికి వెళ్లి అతన్ని కలవమంటాడు. ఇంతకీ శకుంతల ఏమి చేస్తుంది, దుష్యంత మహారాజు ఎందుకు శకుంతలని తీసుకు వెళ్ళడానికి రాలేదు, ఇవన్నీ తెలియాలంటే 'శాకుంతలం' (Shaakuntalam Film Review) చూడండి.

Shaakuntalam.jpg

విశ్లేషణ:

పౌరాణిక సినిమాలు తీయాలంటే తెలుగు వాడే తీయాలి అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలుగులో వచ్చినన్ని పౌరాణిక సినిమాలు ఇంకా ఏ భాషలోని రాలేదు అంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు గుణశేఖర్ గొప్ప దర్శకుడే, అందులో సందేహం లేదు. పోయినసారి చారిత్రాత్మిక సినిమా 'రుద్రమదేవి' (Rudhramadevi) తీసాడు, ఈసారి పౌరాణిక సినిమా 'శాకుంతలం' తో వచ్చాడు. దీని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. మహాకవి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఎంతో గొప్ప రచనల్లో ఒకటి. భారతంలో కథని కాళిదాసు కొంత కల్పితాన్ని జోడించి ఒక ప్రేమకావ్యంగా రాసాడు. దీన్ని మన గుణశేఖర్ 'శాకుంతలం'గా తీసాడు.

shakuntalam-15b.jpg

నా చిన్నప్పుడు మా నాన్నగారు అంటూ ఉండేవారు, ఏదైనా సరిగ్గా రాయకపోతే, ఏంటి రా 'కాళిదాసు కవిత్వం కొంత అయితే, నీ పైత్యం కొంత' అని. అది తెలుగులో సామెత. అది ఇప్పుడు సరిగ్గా ఈ శాకుంతలానికి వర్తిస్తుంది. ఎందుకంటే తెలియని కథలు తీయటం సులువు, కానీ తెలిసిన కథలు తీయటం కష్టం. ఎందుకంటే ప్రేక్షకులకు కథ ఏంటో తెలుసు, తదుపరి సన్నివేశం ఏమి వస్తుందో తెలుసు, అందుకని తెలిసిన కథని ప్రేక్షకులు ఆసక్తిగా చూడాలంటె దర్శకుడి ప్రతిభ అవసరం. తెరమీద దృశ్యాలు కట్టి పడేయాలి. కానీ ఇక్కడ గుణశేఖర్ సినిమా ఎప్పుడు అయిపోతుందా అనేలా తీసాడు. మనం శాకుంతలం సినిమాకి వచ్చామా, లేదా టీవీలో ఏదైనా సీరియల్ చూస్తున్నామా అన్నట్టుగా వుంది.

ఏనుగొస్తోంది ఏనుగొస్తోంది ఎంత పెద్ద సౌండ్ చేస్తుంది అనుకుంటే 'తుస్సు'మందిట. ఆలా వుంది గుణశేఖర్ చిత్రం. ప్రతి ఒక్కరు చూసి తీరాలి, ఒక గొప్ప ప్రేమ కావ్యం అని చెప్పి సీరియల్ ల తీస్తే ఎలా. ఒకవేళ ఈ సినిమా కనక ఎవరైనా చూస్తే, పౌరాణిక సినిమాలు తీయాలంటే అంటే తెలుగువాడు తీయాలి కదా అనుకునేవాడు అభిప్రాయం మారిపోతుంది. పూర్వం ఎన్నో పౌరాణికాలు తీశారు, అందులో కల్పిత కథలు కూడా వున్నాయి, కానీ కళ్ళకు కట్టినట్టుగా తీశారు. నిజంగా ఆలా జరిగిందేమో అనేట్టుగా వున్నాయి. కానీ గుణశేఖర్ సినిమా ఒక సెట్ వేసి, అందులోనే అన్నీ చుట్టేశాడు అనిపిస్తుంది. దానికితోడు ఈ '3డి' ఒకటి. సాంకేంతిక లోపాలు చాలా వున్నాయి.

Shaakuntalam.jpg

పోనీ అవన్నీ వదిలేయండి, సినిమాలో ఏమైనా భావోద్వేగాలు ఉన్నాయా అంటే, అవీ లేవు. సంఘర్షణ ఉండాలి కదా. నటీనటులు అందరూ డైలాగులు రాసి ఇస్తే ఎలా అప్పచెపుతారో ఆలా చెప్పేసారు. ఒక్కరి మొహం లో కూడా ఒక్క ఎమోషన్ లేదు. మనం పౌరాణికం సినిమా చూస్తున్నామా లేక ఇంకేదయినా అని కూడా అనిపిస్తుంది. సీనియర్ నటుడు మోహన్ బాబు తప్ప, ఇంకెవరూ ఈ సినిమాలో నటించలేదు. ఎదో వచ్చి వెళ్లారు. భాష కన్నా భావం ముఖ్యం అంటారు కదా, మరి అలాంటప్పుడు ఇంత ప్రేమ కావ్యాన్ని తీసేటప్పుడు తెలుగు నటులే కరువయ్యారా? ఎందుకంటే తెలుగు వాళ్ళు అయితే భాషలో వుండే భావం అర్థం చేసుకొని అది మొహం లోకి తెచ్చుకొని చేస్తారు. ఒకటేమిటి ఇందులో చాలా లోపాలు వున్నాయి, గుణశేఖర్ ఈసారి పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

shakuntalam1.jpg

నటీనటుల విశ్లేషణ:

ఇక నటీనటుల విషయానికి వస్తే, సమంతకి శకుంతల అనే పాత్ర చాలా బరువయినది. దానికి ఆమె చాలా హోంవర్క్ చేసి ఉండాలి, కానీ అవేమీ కనిపించలేదు. ఆమె ఆ పాత్రకి సరిగ్గా సూట్ కాలేదు. దానికితోడు ఆమె సొంత వాయిస్ కూడా ఆమెకి మైనస్ అయింది. తెలుగు డైలాగ్స్ చెప్పినందుకు ఆమెని అభినందించాలి, కానీ ఇది పౌరాణిక సినిమా, ఇందులో మాటలు మామూలు సినిమాకి చెప్పేసినట్టు చెపితే, ప్రేక్షకులకి ఎక్కవు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం పరవాలేదు అన్నట్టుగా చేసింది. ఇంక దేవ్ మోహన్ కూడా దుశ్యంతుడి పాత్రకి చూడటానికి బావున్నాడు, కానీ అదొక్కటే సరిపోదు కదా. భావోద్వేగాలు పలికించాలి. మొహం లో ఎటువంటి కదలికలు లేకుండా ఒక చెక్కబల్ల మొహంతో కనపడతాడు. మిగతావాళ్ళు అందరూ అంతే. సీనియర్ నటుడు మోహన్ బాబు మాత్రం తళుక్కున మెరుస్తాడు. అతను సీనియర్, డైలాగ్ కింగ్. అతని గురించి చెప్పేదేముంది. అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అల్లు అర్హ (Allu Arha) చక్కగా చేసింది. చివరి పదిహేను నిముషాలు ఆమె కనిపించి కనువిందు చేసింది. సినిమా అందరికన్నా తెలుగు చక్కగా మాట్లాడిన అర్హకి ఎంతో భవిష్యత్తు వుంది అనిపిస్తుంది.

alluarha3.jpg

సాంకేతిక పరంగా సినిమాలో చాలా లోపాలున్నాయి. నేను '3డి' సినిమా చూసా కాబట్టి దీని గురించి చెప్తున్నా. మాటలు పరవాలేదు. ఈ సినిమాలో ఏదైనా బాగుంది, ప్లస్ పాయింట్ ఏంటి అంటే అది ఒక్క మణిశర్మ సంగీతం మాత్రమే. నేపధ్య సంగీతం, పాటలు బాగున్నాయి.

చివరగా, కాళిదాసు కవిత్వం కొంత అయితే నీ పైత్యం కొంత అన్నట్టు, మహావి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' సినిమాని గుణశేఖర్ టీవీ సీరియల్ లాగా తీసేసాడు. కనీసం దీనిమీద హోమ్ వర్క్ కూడా సరిగా చెయ్యలేదు అనిపిస్తోంది. అంత మంచి ప్రేమ కావ్యాన్ని ఒక చెత్త సినిమాగా తీసి చెడగొట్టాడు అనిపిస్తుంది. దీనికి బదులు టీవీలో వస్తున్న ఆ డబ్బింగ్ పౌరాణిక సీరియల్స్ ఎంతో బాగుంటాయి.

Updated Date - 2023-04-14T08:55:20+05:30 IST