ఓటీటీలో.. ర‌ష్య‌న్ పిరియడ్‌, వార్, యాక్ష‌న్ సినిమా! డోంట్ మిస్

ABN , Publish Date - Dec 21 , 2023 | 06:24 PM

ప్ర‌తి వారం ఓటీటీల్లో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌స్తుంటాయి. వాటిలో కొన్ని సినిమాలు ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంటాయి. ఇలాంటి సినిమాల స‌మాచారం చాలా మంది సినీ ప్రేక్ష‌కుల‌కు తెలిసే అవ‌కాశం ఉండ‌దు. ఈ క్ర‌మంలో మంచి క‌థ‌, యాక్ష‌న్ ల‌తో వ‌చ్చే సినిమాల‌ను మ‌నం మిస్ అవుతుంటాం. ఆ కోవ‌కు చెందిన సినిమానే ‘ప్యూరియ‌స్‌’.

ఓటీటీలో.. ర‌ష్య‌న్ పిరియడ్‌, వార్, యాక్ష‌న్ సినిమా! డోంట్ మిస్
Furious

ప్ర‌తి వారం ఓటీటీల్లో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌స్తుంటాయి. అవి ఎందులో, ఎప్పుడు వ‌స్తున్నాయో ముందే వివిధ మాధ్య‌మాల ద్వారా ప్ర‌క‌టిస్తుంటాయి. గానీ కొన్ని సినిమాలు ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంటాయి. ఇలాంటి సినిమాల స‌మాచారం చాలా మంది సినీ ప్రేక్ష‌కుల‌కు తెలిసే అవ‌కాశం ఉండ‌దు. ఈ క్ర‌మంలో మంచి క‌థ‌, యాక్ష‌న్ ల‌తో వ‌చ్చే సినిమాల‌ను మ‌నం మిస్ అవుతుంటాం. ఆ కోవ‌కు చెందిన సినిమాలే ‘ప్యూరియ‌స్‌’.

2017లో విడుదలైన రష్యన్ ఎపిక్, పిరియాడికల్ యాక్షన్ చిత్రం ‘ప్యూరియ‌స్‌’(Furious (2017 film). జానిక్ ఫైజీవ్ మరియు ఇవాన్ షుర్ఖోవెట్స్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఇల్యా మలాకోవ్ (Ilya Malakov) హీరోగా పరిచయం అవగా మొదటి చిత్రమే 12వ శతాబ్దపు ప్రఖ్యాత సైన్యాధిపతి ఎవ్‌పాటి కొలోవ్‌రాట్ పాత్రలో నటించి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. అతనితో పాటు ఇంకా ఈ చిత్రంలో పోలినా చెర్నిషోవా, అలెక్సీ సెరెబ్రియాకోవ్, అలెగ్జాండర్ ఇలిన్ జూనియర్, యులియా ఖ్లీనినా సహాయక పాత్రల్లో నటించారు.


furious1_large.jpg

కథ విషయానికి వస్తే.. 1237వ సంవత్సరంలో అప్పటి రష్యా (రియాజాన్)పై మంగోలీయా చక్రవర్తి భటూ ఖాన్ తన వేల మంది సైన్యంతో దాడి చేసి ఓ నగరాన్ని దోచుకుంటారు. ఈ క్రమంలో పడుకుంటే మతిమరుపు వచ్చే అలవాటు ఉన్న ఆ నగర ప్రధాన సైనికాధికారి ఎవ్‌పాటి కొలోవ్‌రాట్ మంగోల్ సైన్యాన్ని నాశనం చేసి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసి వారిపై దాడికి వెళతాడు.

ఈ క్రమంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనే రోజుల తరబడి యుద్దం చేయాల్సి రావడం, తన వెంట ఉన్న వారు ఒక్కోక్కరే చనిపోవడం అఖరుకు అంతా ఒకడే అయి మంగోల్ సైన్యాన్ని ఎన్ని ముప్పతిప్పలు పెట్టాడు, చివరకు భటూ ఖాన్ ఆ రష్యన్ వీరుడిని ఏం చేశాడనే ఇతి హాస గాధ ఆధారంగా ఆధ్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించారు.

ముఖ్యంగా సినిమాలో యుద్ద సన్నివేశాలు, మంచు తుఫాన్ విజువల్స్ అద్భుతంగా చిత్రీకరించారు. ఒకటి , రెండు చోట్ల బోల్డ్ సీన్లు మినహా సినిమాను కుటుంబంతో కలిసి చూడవచ్చు. ఈ చిత్రాన్ని మూడు నెలల క్రితం రష్యన్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చారు. ఈ సినిమా చాలా మందికి నచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి గానీ కొంతమందికి తెలియక ఓ మాములు చిత్రం కింద జమ చేస్తున్నారు. సో ఇప్పటికైనా డోంట్ మిస్ ది మూవీ.

Updated Date - Dec 21 , 2023 | 06:27 PM