Dhwani: దర్శకుడిగా 10 ఏళ్ల పిల్లాడు.. అతని టార్గెట్ ఏంటో తెలుసా?
ABN , First Publish Date - 2023-07-11T21:11:37+05:30 IST
ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్‌లో 10 ఏళ్ల పిల్లాడు లక్షిన్ దర్శకత్వం వహించిన లఘు చిత్రం ‘ధ్వని’. డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్‌తో ఈ లఘు చిత్రం రూపొందించబడింది. నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించిన ఈ షార్ట్ ఫిలింకు అశ్విన్ కురమన సంగీతం అందించారు. తాజాగా ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమాన్ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్‌లో లక్షిన్ దర్శకత్వం వహించిన లఘు చిత్రం ‘ధ్వని’ (Dhwani). డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్‌తో ఈ లఘు చిత్రం (Short Film) రూపొందించబడింది. నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించిన ఈ షార్ట్ ఫిలింకు అశ్విన్ కురమన సంగీతం అందించారు. తాజాగా ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమాన్ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు నిర్మాత బెల్లంకొండ సురేష్, తుమ్మల రామసత్యనారాయణ, దర్శకులు కరుణ కుమార్ మరియు జ్యోతి కృష్ణ వంటివారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లక్షిన్‌కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ వరించడం విశేషం. పది ఏళ్ల లక్షిన్ ఇరవై ఏళ్లలోపు ఇరవై ఫిలిమ్స్ చేయాలనేది లక్ష్యంగా ఈ కార్యక్రమంలో తెలపడం విశేషం. (Dhwani Short Film Release Press Meet)
ఈ లఘు చిత్రం విడుదల సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) మాట్లాడుతూ... లక్షిన్ పది ఏళ్ల వయసులో దర్శకత్వం చేయడం అభినందించదగ్గ విషయం. వివిధ రకాల కంటెంట్‌ను మనం ఇప్పుడు వివిధ మాధ్యమాల్లో చూస్తున్నాం. ధ్వని ది బెస్ట్ కాన్సెప్ట్, బెటర్ ఔట్ ఫుట్‌తో లక్షిన్ తీశాడు. ఈ అబ్బాయి భవిషత్తులో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నానని తెలపగా.. దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar) మాట్లాడుతూ... లక్షిన్ తీసిన షార్ట్ ఫిలిం చాలా బాగుంది. ఈ వయసులో అతను తీసిన విధానం ఎంతో బాగుంది. ధ్వని కాన్సెఫ్ట్‌ను పదకొండు నిమిషాల్లో అద్భుతంగా తెరకెక్కించారు. చాలా మంది నూతన దర్శకుల కంటే లక్షిన్ బెటర్‌గా ఈ షార్ట్ ఫిల్మ్‌ను తీశారని తెలిపారు. చిన్న వయసులో పెద్ద నిర్ణయం తీసుకున్న లక్షిన్‌కు అభినందనలు తెలిపారు దర్శకుడు జ్యోతి కృష్ణ.
డైరెక్టర్ లక్షిన్ (Lakshin) మాట్లాడుతూ.. నేనీ షార్ట్ ఫిలిం చేయడానికి ఎంకరేజ్ చేసిన నా పేరెంట్స్‌కు థాంక్స్. చిన్న కాన్సెప్ట్‌తో తీసిన ఈ షార్ట్ ఫిలింకు అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దర్శకుడిగా మంచి సినిమాలు చేయాలనేది నా కోరిక. భవిషత్తులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్‌తో మూవీ చేయాలనేది నా డ్రీమ్ అని తెలిపారు. నిర్మాత నీలిమ వేముల (Neelima Vemula) మాట్లాడుతూ.. లక్షిన్ ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు సినిమా డైరెక్ట్ చేస్తాను అన్నాడు. పదేళ్ల వయసులో ఇంత పెద్ద భాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడో అనే సందేహంతో షార్ట్ ఫిలిం చేయమని అడిగాను. అంతే ధ్వని అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పదకొండు నిమిషాల్లో ఈ ఫిల్మ్‌ని తీసి చూపించాడు. షార్ట్ ఫిలిం చాలా బాగా తీశాడు, అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఆనందంగా ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Bholaa Shankar: సెలబ్రేషన్ సాంగ్ వచ్చేసింది.. కీర్తి, తమన్నాలతో చిరు స్టెప్పులు
********************
*Mani Sharma: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘మణి’హారం
**************************************
*Thaman S: ట్రోల్స్‌పై సంగీత దర్శకుడు థమన్ ఏమన్నారంటే..
**************************************
*Viraj Ashwin: ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందంటోన్న యంగ్ హీరో
**************************************
*Brahmaji: మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్.. తర్వాత మనం కష్టపడాల్సిందే..
**************************************