Rajendra Prasad: అందుకే ఎన్టీఆర్‌ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది

ABN , First Publish Date - 2023-06-18T22:55:49+05:30 IST

రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత నందమూరి తారక రామారావు (NTR) సొంతమని, ఈరోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నటుడు నట కిరీటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

Rajendra Prasad: అందుకే ఎన్టీఆర్‌ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది
Nata Kireeti Rajendra Prasad at Kalayika Foundation Event

రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత నందమూరి తారక రామారావు (NTR) సొంతమని, ఈరోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నటుడు నట కిరీటి రాజేంద్రప్రసాద్ (Nata Kireeti Rajendra Prasad) పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని.. కలయిక ఫౌండేషన్ (Kalayika Foundation) తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలను నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేసింది.

Kalayika.jpg

రెండు విభాగాల్లో ప్రధములుగా నిలిచినవారికి లక్ష రూపాయల చొప్పున బహూకరించి, మిగతా విజేతలకు సుమారు అయిదు లక్షల రూపాయల నగదు బహుమతులు అందించారు. చేరాల అజయ్ కుమార్, కళ్యానపు శ్రీనివాస్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి - విశ్రాంత హోమ్ సెక్రటరీ కె.పద్మనాభయ్య, ఆదాయపన్ను కమిషనర్ జీవన్ లాల్ లవాడియ, గజల్ శ్రీనివాస్, బృహస్పతి టెక్నాలజీస్ ఎమ్.డి రాజశేఖర్, సిఎస్.బి. ఐ.ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ బాల లత తదితరులు అతిథులుగా హాజరై... కలయిక ఫౌండేషన్ అధినేత చేరాల నారాయణ (Cherala Narayana)ను అభినందించారు. అతిథులకు కృతజ్ఞతలు తెలిపిన చేరాల నారాయణ... విజేతలకు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Adipurush Collections: ఆ రెండూ ఊహించినవే కానీ.. ఈ ఏరియాలో మాత్రం ప్రభాస్‌కి కోలుకోలేని దెబ్బే!

**************************************

*Sitara: చిచ్చర పిడుగులా చెలరేగిపోతోన్న మహేష్ తనయ.. సాయిపల్లవిని దించేసింది

**************************************

*Spy: మరో పాన్ ఇండియా సంచలనానికి సిద్ధమైన నిఖిల్.. ఎప్పుడంటే?

**************************************

*Adipurush: ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

**************************************

*Prabhas Fans: సినిమా బాలేదన్నందుకు ఒకర్ని.. హనుమ కుర్చీలో కూర్చున్నందుకు మరొకర్ని.. చితకబాదారు

**************************************

*Lord Hanuma: ‘ఆదిపురుష్’ థియేటర్‌లోకి వానరం.. హనుమంతుడే అంటూ ఆడియన్స్ జైశ్రీరామ్ నినాదాలు.. వీడియో వైరల్

Updated Date - 2023-06-18T22:56:35+05:30 IST