TG Vishwa Prasad: ‘బ్రో’ చిత్ర నిర్మాతకు మాతృవియోగం

ABN , First Publish Date - 2023-06-30T19:18:33+05:30 IST

సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధినేత టి.జి. విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మాతృమూర్తి శ్రీమతి టి.జి గీతాంజలి (70) (Geethanjali) ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 6.10 నిమిషాలకు శివైక్యం చెందారు.

TG Vishwa Prasad: ‘బ్రో’ చిత్ర నిర్మాతకు మాతృవియోగం
Producer TG Viswa Prasad

సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధినేత టి.జి. విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మాతృమూర్తి శ్రీమతి టి.జి గీతాంజలి (70) (Geethanjali) ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 6.10 నిమిషాలకు శివైక్యం చెందారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బెంగళూరు‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకోలేని పరిస్థితుల కారణంగా తల్లి (TG Vishwa Prasad Mother Geethanjali) చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి (Varanasi) తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం, ఈరోజు ఆవిడ తుది శ్వాస విడిచారు. గీతాంజలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు.

TV-Viswa-Prasad.jpg

విశ్వప్రసాద్ విషయానికి వస్తే.. ఆయన నిర్మాణ సారథ్యంలో వివేక్ కూచిభోట్ల సహనిర్మాతగా ‘బ్రో’ (Bro) అనే చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. మేనమామ-మేనల్లుడు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన తారాగణంగా తమిళ దర్శకనటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గురువారం ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేయగా.. భారీ స్పందనను రాబట్టుకుంటోంది. జూలై 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఇవి కాకుండా మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్‌ని ఆయన నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం


**************************************

*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!


**************************************

*Maamannan: చివరి నిమిషంలో తొలగిన కోర్టు చిక్కులు.. టాక్ ఏంటంటే?

**************************************

*Bro Teaser Talk: మామ అల్లుళ్ళ మాస్ ర్యాగింగ్..


**************************************

*Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ విడుదల ఎప్పుడంటే..


**************************************

Updated Date - 2023-06-30T19:20:14+05:30 IST