Memories: అడివి శేష్ చేతుల్లో సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’

ABN , First Publish Date - 2023-12-02T20:59:22+05:30 IST

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత యువ నటుడు సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్‌ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. తాజాగా ఈ మ్యూజిక్ వీడియోని టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ విడుదల చేసి.. సాంగ్ అద్భుతంగా ఉందని కొనియాడారు.

Memories: అడివి శేష్ చేతుల్లో సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’
Sudhakar Komakula

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత యువ నటుడు సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) ‘మెమొరీస్’ (Memories) అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్‌ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. USA లోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్‌ మిక్స్ చేసి చిత్రీకరించారు. ‘మెమొరీస్’ వీడియో సాంగ్‌ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ వేదికపై విడుదల చేశారు. రీసెంట్‌గా విడుదల చేసిన సాంగ్ టీజర్‌కు మంచి స్పందన రావడంతో.. నివ్రితి వైబ్స్‌వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోను టాలెంటెడ్ నటుడు అడివి శేష్ (Adivi Sesh) విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, సాంగ్ అద్భుతంగా ఉందని అడివి శేష్ తెలిపారు.

అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో సైమా అవార్డ్స్‌లో నామినేట్ అయిన ‘చోటు’ అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్‌గా.. సోని మ్యూజిక్‌లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం ‘మనోహరం’కి రైటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అన్వేష్ పనిచేశారు. ఇప్పుడు ‘మెమొరీస్’ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. ఈ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు? అనేది ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో‌లోని ఐకానిక్ లొకేషన్లను ఇందులో కనువిందుగా చూపించడం జరిగింది. రియల్ వరల్డ్‌లో 2డి యానిమేషన్ ద్వారా జెస్సికా‌ని యాడ్ చేసిన ప్రయోగం చాలా బాగుంది.. కొత్తగా ఉంది. ఇలా చేయడం ఇదే మొదటిసారి అని సాంగ్ మేకర్స్ చెబుతున్నారు. (Memories Music Video)


Sudhakar.jpg

ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంది. సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ శ్రోతలను ఎంటర్‌టైన్ చేసే విధంగా ఉంది. ఈ సాంగ్‌లోని మెలోడీ, వీడియో ఆకట్టుకుంటూ జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘యానిమ‌ల్’ త‌ర‌హా చిత్రాల‌ను నేను కూడా నిర్మిస్తా.. కాకపోతే?

*************************************

*Nithiin: నేను సపోర్ట్ చేస్తే.. పవర్ స్టార్ గెలిచేస్తారా?

***********************************

*Pindam Movie: సినిమాకు ‘పిండం’ అని టైటిల్ పెట్టడానికి కారణమిదేనట..

***************************************

*SS Karthikeya: ‘యానిమల్’‌ని చూసిన ఎస్.ఎస్. రాజమౌళి తనయుని రియాక్షన్ ఇదే..

*************************************

Updated Date - 2023-12-02T20:59:24+05:30 IST