Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)

ABN , First Publish Date - 2023-02-23T19:58:45+05:30 IST

ప్రసాద్ ల్యాబ్‌లో జనరల్ మేనేజర్‌గా వర్క్ చేస్తూ.. సినిమాకి చాలా దగ్గరగానే కాకుండా.. సినిమా చూసి హిట్టో.. ఫట్టో చెప్పగల నైపుణ్యం కలిగిన వ్యక్తి వెల్లంకి నాగినీడు (Vellanki Nagineedu). ‘మర్యాద రామన్న’ (Maryada Ramanna) చిత్రంతో

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)
Nagineedu at Open Heart With RK

ప్రసాద్ ల్యాబ్‌లో జనరల్ మేనేజర్‌గా వర్క్ చేస్తూ.. సినిమాకి చాలా దగ్గరగానే కాకుండా.. సినిమా చూసి హిట్టో.. ఫట్టో చెప్పగల నైపుణ్యం కలిగిన వ్యక్తి వెల్లంకి నాగినీడు (Vellanki Nagineedu). ‘మర్యాద రామన్న’ (Maryada Ramanna) చిత్రంతో నటుడిగా నంది అవార్డు (Nandi Award)ను సైతం అందుకున్న నాగినీడు.. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించారు. ఇప్పటికీ తన దగ్గరకు వచ్చిన పాత్రలలోని మంచి పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ.. నటుడిగా తనేంటో నిరూపించుకుంటున్నారు. తాజాగా ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart With RK) కార్యక్రమంలో పాల్గొని.. తన లైఫ్‌లోని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో (Open Heart With RK Promo) తాజాగా విడుదలైంది. ఇందులో

‘‘* ఈ గ్రామం శిథిలమైపోతుందండీ.. మీరే దీనిని పునరుద్ధరణ చేయాలండీ.. అని అంటుంటే.. అక్కడ సెటిలయ్యా. సెటిల్ అయిన తర్వాత అక్కడికి, ఇక్కడికి వెళ్లడం, రావడం చేస్తూ ఉండేవాడిని. అది నా హిస్టరీ.

* మనం ఎప్పుడూ లేటెస్ట్‌గా ఉండాలి.. కానీ ఫంక్షనింగ్ మాత్రం పాతదే చేయాలి. లేటెస్ట్‌గా కనిపించినా.. పద్ధతులు మాత్రం పాతవే.

* ప్రసాద్ ల్యాబ్‌కి రాఘవేంద్రరావుగారు, కృష్ణగారు, కృష్ణంరాజుగారు, దాసరిగారు ఇలా అందరూ వచ్చేవారు. కానీ ఎప్పుడూ నేను నోరు తెరిచి.. నాకు ఇది కావాలని అడగలేదు.

* ‘మర్యాదరామన్న’లో నేను చేసిన పాత్రే నా ఒరిజినల్ పాత్ర. నేను పెరిగింది రాయలసీమ.. క్యారెక్టర్ కూడా అదే. నాకు ఇచ్చే మర్యాదను బట్టే.. నేను ఇచ్చే మర్యాద ఉంటుంది. అలాగే నాకు ఎవరైనా తేడా చేస్తే.. దానికి కొన్ని రెట్లు నేను తేడా చేసి చూపిస్తా. (Actor Vellanki Nagineedu Open Heart With RK)

* ఫ్యాక్షన్ లీడర్స్ ఉంటారు.. ఫ్యాక్షనిజం చేస్తుంటారేమో నాకు తెలియదు కానీ.. తప్పు జరిగిన చోట మాత్రం నేనొక ఫ్యాక్షన్ లీడర్‌నే.

* పనికి భయపడినవాడు నాకు భయపడతాడు. వాళ్లకి పని చేతకాకే.. మిమ్మల్ని చూస్తే భయమండి అని అంటుంటారు.

* మా నాన్నగారు అప్పట్లోనే 8 వరకు చదివారు. ఆయన సంస్కృతంలో శ్లోకాలు రాయగలరు. నేను మాత్రం తెలుగులో ఎప్పుడూ తప్పేవాడిని. మా మాస్టారు.. ‘ఓరి పండిత పుత్రా.. పరమశుంఠా’ అని అంటుండేవారు. (Senior Actor Vellanki Nagineedu)

* 9, 10 చదివేటప్పుడే నేను థియేటర్‌కి వెళ్లి.. టికెట్స్ ఇవ్వడం, బ్లాక్ మార్కెట్‌లో టికెట్స్ అమ్మేవాళ్లని కొట్టేయడం వంటివి చేసేవాడిని. ఒక రకంగా నాలో రౌడీ మోతాదు కూడా ఎక్కువే.

* ప్రసాద్ ల్యాబ్‌లో తొలి ప్రేక్షకుడి పాత్ర పోషించేవాడిని. నేను ‘ప్రేమాభిషేకం’ సినిమా చూసి.. చివరి నాలుగు రీళ్లు చాలు.. సినిమా సిల్వర్ జూబ్లీ అని చెప్పాను. ‘అడవి సింహాలు’ చూసి.. ఈ సినిమా పోతుందని చెప్పాను.

* నా గురించి నాకు భయం లేదు. నన్ను ఆదుకోరు.. నాకు అవకాశాలు ఇవ్వరు వంటి భయాలు నాకస్సలు లేవు. ఇది పొగరు కాదు.. నా మీద నాకు నమ్మకం.

* ఇండస్ట్రీకి.. నా ప్రొఫైల్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని చెబుతాను..’’ వంటి ఎన్నో విషయాలను ఆయన చెప్పుకొచ్చారు. ఇవే కాకుండా.. ఇంకా ఆయన చెప్పిన విశేషాలు తెలియాలంటే ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ‘ABN ఆంధ్రజ్యోతి’లో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart With RK) కార్యక్రమం చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి

*********************************

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Ram Charan: ఆ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం

Updated Date - 2023-07-29T22:33:53+05:30 IST