Superstar Krishna: 32 సంవత్సరాల తరువాత వైరల్ అవుతున్న మహేష్ బాబు సోదరి లగ్న పత్రిక

ABN , First Publish Date - 2023-06-26T17:56:08+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ గారు తన పెద్ద కుమార్తె పద్మావతిని గల్లా జయదేవ్ కి ఇచ్చి 32 సంవత్సరాల క్రితం అంటే జూన్ 26, 1991 సంవత్సరంలో చెన్నైలో వివాహం జరిపారు. అప్పుడు ప్రింట్ చేసిన ఆ లగ్న పత్రిక ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పెళ్ళికే కృష్ణగారు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను రావొద్దన్నారు.. ఎందుకో తెలుసా...

Superstar Krishna: 32 సంవత్సరాల తరువాత వైరల్ అవుతున్న మహేష్ బాబు సోదరి లగ్న పత్రిక
File pictures of Krishna and Jayalalitha

సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) గారు ఏది చేసినా డేరింగ్ గానే చేస్తారు. కృష్ణ గారికి, ఇందిరాదేవికి (Indiradevi) అయిదుగురు సంతానం అందులో పద్మావతి (Padmavathi) పెద్ద కుమార్తె, తరువాత రమేష్ బాబు (RameshBabu), మంజుల (Manjula), ఇప్పటి సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu), తరువాత ప్రియదర్శిని (Priyadarshini). పెద్ద కుమార్త్ వివాహం 1991 జూన్ నెలలో చెన్నైలో గల్లా జయదేవ్ (GallaJayadev) తో చాలా అట్టహాసంగా జరిగింది. గల్లా జయదేవ్, అప్పట్లో గల్లా అరుణకుమారి, రామచంద్ర రావు ల ఏకైక కుమారుడు. ఇప్పుడు అతను పార్లమెంటు మెంబరు.

అయితే అప్పట్లో చాలా సింపుల్ గా అచ్చు వేయించిన ఆ లగ్న పత్రిక ఇప్పుడు అన్ని గ్రూప్ లో వైరల్ అవుతోంది. కార్డు అయితే సింపుల్ గా కనిపిస్తున్నా, పెళ్లి మాత్రం చాలా అట్టహాసంగా చేశారు అని అప్పట్లో అనేవారు. చెన్నైలో అప్పట్లో ఈ పెళ్లి గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి చాలామంది రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన చాలామంది ఈ పెళ్ళికి హాజరయ్యారు.

gallajayadev.jpg

అలాగే అప్పుడు తమిళ నాడు (TamilNadu) ముఖ్యమంత్రి జయలలితని (Jayalalitha) కూడా కృష్ణ గారు పెళ్ళికి ఆహ్వానించారు. ఆమె తప్పకుండా వస్తాను అని చెప్పి, ఈ పెళ్ళికి వెళ్లాలని తయారయ్యారు. అయితే ఆమెకి అప్పట్లో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉండేది. అందుకని ముందు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మంటపంలో చాలామందిని కాళీ చేయించాలని కృష్ణగారికి చెప్పారట. అప్పటికే, మంత్రులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులూ, వ్యాపారవేత్తలు కూర్చొని వున్నారు, వాళ్ళని లేపెయ్యలని సెక్యూరిటీ వాళ్ళు చెప్పగానే, కృష్ణగారు ఆలా లేపటం బాగోదు అని అన్నారట.

weddingcard-krishna.jpg

ఆలా అయితే ఆమె రావటం కష్టం, ఎందుకంటే ఆమె రావాలంటే ముందు రెండు వరసలు కాళీ చెయ్యాల్సిందే అని చెపితే, కృష్ణ గారు వెంటనే ఆమెని పెళ్ళికి రావద్దని చెప్పారట. ఆ విషయం జయలలిత కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకొని, శుభాకాంక్షలు చెపుతూ ఒక పుష్ప గుచ్చం పంపించారట. పద్మావతి పెళ్లి అందుకే అది అందరికీ గుర్తుండిపోయింది. ఆ పెళ్లి జరిగి ఈరోజుకి 32 సంవత్సరాలు అయింది, అంటే ఇదేరోజు అంటే జూన్ 26 న, అయింది, అందుకని అప్పటి ఆ లగ్న పత్రిక ఇప్పుడు వైరల్ అవుతోంది.

Updated Date - 2023-06-26T17:56:08+05:30 IST