Pic Talk: చందురుని మించు అందమొలికించు...
ABN , First Publish Date - 2023-05-07T11:01:04+05:30 IST
ఈ చిత్రాన్ని మొదట అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), సావిత్రి (Savitri)లతో తీయాలనుకున్నారు. కానీ అక్కినేని.. సావిత్రికి అన్న (Brother)గా వేయడానికి..
రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ (Rajalakshmi Productions) వారి ‘రక్త సంబంధం’ (1-11-1962) చిత్రం (Rakta Sambandham Movie) లోనిదీ స్టిల్. తమిళంలో ఘన విజయం సాధించిన ‘పాశమలర్’ (Pasamalar) చిత్రానికి తెలుగు వెర్షన్. ఈ చిత్రాన్ని మొదట అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), సావిత్రి (Savitri)లతో తీయాలనుకున్నారు. కానీ అక్కినేని.. సావిత్రికి అన్న (Brother)గా వేయడానికి ఒప్పుకోకపోవడంతో, ఎన్.టి.ఆర్. (NT Rama Rao) ఆ పాత్ర పోషించారు.
ఎన్.టి.రామారావు, సావిత్రి అన్నాచెల్లెళ్ల (Brother and Sisters) పాత్రల నుండి విడదీయరానంతగా ఆ పాత్రల్లో లీనమై నటించారు. తోబుట్టువు సుఖం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన అన్నయ్యగా ఎన్.టి.రామారావు (NTR) ప్రేక్షకుల్ని ఏడిపించేశారు. ప్రతి మహిళ ఈ చిత్రంలోని అన్నలాంటి అన్న తనకూ ఉంటే బావుండునని అనుకున్న చిత్రమిది.
‘బంగారు బొమ్మ రావేమే’ పాట లేని పెళ్లిపందిరి, ‘చందురుని మించు అందమొలికించు’ అన్న జోలపాట పాడని తల్లి ఆనాడు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలు ఎన్.టి.ఆర్, సావిత్రిల నటనకు గొప్ప ఉదాహరణలుగా నిలిచాయి.
10-10-1988న జంటనగరాల్లో మరోసారి విడుదలై రిపీట్ రన్లో కూడా వందరోజుల ఆడి విజయపతాకం ఎగురవేసిందీ చిత్రం. 5-2-1989న హైదరాబాద్ చిక్కడపల్లి ఫంక్షన్ ప్యాలెస్‌లో ద్వితీయ శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా వి. మధుసూదన రావు (V. Madhusudhana Rao) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటసాల (Ghantasala) సంగీతం అందించారు.
- డా. కంపల్లె రవిచంద్రన్ (98487 20478)
ఇవి కూడా చదవండి:
************************************************
*Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను
*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!
*Ramabanam Film Review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...
*Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు
*Takkar: చాలా రోజుల తర్వాత.. ఓన్లీ హీరోయిన్‌పైనే సాంగ్
*The Kerala Story: అది కాదు.. ఇది కదా అసలు స్టోరీ.. ఏఆర్ రెహమాన్ కూడా దండం పెట్టేశారు