Jayapradha: ‘ఓసి.. ఆ పిల్లవి నువ్వెనన్నమాట’ అని ఎన్టీఆర్ పెద్దగా నవ్వేశారు

ABN , First Publish Date - 2023-05-28T17:41:37+05:30 IST

ఒక అభిమానికి తన అభిమాన హీరో సరసన నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. అలాంటి అదృష్టాన్ని జయప్రద పొందారు. తన చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకుంటూ జయప్రద ఓ సందర్భంలో చెప్పిన ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. హీరోయిన్ కాకముందే ఆమె ఎన్టీఆర్‌ని కలిశారట. అంతవరకూ తెర మీద చూసిన ఎన్టీఆర్‌ ఎదురుగా కనిపించేసరికి ఆనందంతో ఆమెకు నోట మాట రాలేదని జయప్రద తెలిపారు.

Jayapradha: ‘ఓసి.. ఆ పిల్లవి నువ్వెనన్నమాట’ అని ఎన్టీఆర్ పెద్దగా నవ్వేశారు
Jayapradha and NT Ramarao

జయప్రద.. ఎన్టీఆర్‌ (NTR) సరసన సాంఘిక చిత్రాలతో పాటు జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించే అవకాశం పొందిన ఏకైక నటి. ఆయన సరసన 11 చిత్రాల్లో నటించారామే. ‘సిరిసిరిమువ్వ’ చిత్రం విడుదలైన కొన్ని రోజులకు ఎన్టీఆర్‌ కబురు చేసి తన సొంత చిత్రం ‘చాణక్య చంద్రగుప్త’లో విషకన్య పాత్ర ఇచ్చారు ఎన్టీఆర్‌. కానీ ఆ సినిమా కంటే ముందు విడుదలైన ‘అడవి రాముడు’ (Adivi Ramudu) చిత్రం ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్‌, జయప్రద జంటకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే వచ్చిన ‘యమగోల’ (Yamagola) ఈ జంటకు డిమాండ్‌ పెంచింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... సినిమాల్లోకి రాక ముందు నుంచి జయప్రద ఎన్టీఆర్‌ అభిమాని (Fan).. ఒక అభిమానికి తన అభిమాన హీరో సరసన నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. తన చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకుంటూ జయప్రద (Jayapradha) ఓ సందర్భంలో ఇలా చెప్పారు.

‘‘నా అసలు పేరు లలితారాణి. చిన్నప్పటి నుంచి రామారావుగారి వీరాభిమానిని. మా తమ్ముడు రాజబాబు (హాస్యనటుడు రాజబాబు కాదు)తో కలసి ఎన్టీఆర్‌ ‘శ్రీకృష్ణావతారం’ చిత్రాన్ని 18సార్లు చూశాను. అందులోని ‘నీ చరణ కమలాల నీడనై చాలు..’ పాట తెగ నచ్చేసింది. ఇంటికి వచ్చాక పదే పదే ఆ పాట పాడుతూ డాన్స్‌ చేసేదాన్ని. రామారావు గారిని కళ్ళారా చూడాలనే కోరిక రోజు రోజుకి పెరిగి పోయింది. ఆయన్ని చూపిస్తే తప్ప అన్నం తినననీ ఒకరోజు మొండికేశాను. మా నాన్నగారికి సినిమావాళ్ళతో పరిచయాలు ఉండేవి. అందుకే నన్ను మద్రాస్‌ తీసుకెళ్లారు. సినిమా పేరు గుర్తులేదు కానీ రామారావు గారు షూటింగ్‌లో ఉంటే నన్ను తీసుకెళ్లారు. అంతవరకూ తెర మీద చూసిన ఎన్టీఆర్‌ ఎదురుగా కనిపించేసరికి ఆనందంతో నాకు నోట మాట రాలేదు. (Jayapradha about NTR)

Jaya.jpg

రాజమండ్రి నుంచి తీసుకెళ్లిన పొలస చేపలు, మామిడిపళ్ళు నా చేతుల మీదుగా ఎన్టీఆర్‌కి ఇప్పించారు నాన్న. ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. తనకోసం సిద్ధం చేసిన ఆపిల్‌ జ్యూస్‌నీ ఒక గ్లాస్‌లో పోసి ఇచ్చి తాగమన్నారు. ఇదంతా చూసి నేను ఎంత సంబరపడిపోయానో... ఆ తర్వాత చాలాసార్లు రామారావు (Ramarao)గారిని కలిశాను కానీ.. ఆయన్ని మొదటిసారి కలిసిన రోజు మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. ‘అడవి రాముడు’ చిత్రం షూటింగ్‌ ముదుమలైలో జరుగుతున్నప్పుడు ఒకరోజు ఈ సంఘటనని ఆయనకు చెప్పాను. ‘ఓసి.. ఆ పిల్లవి నువ్వెనన్నమాట’ అని భుజం తట్టి పెద్దగా నవ్వేశారు ఎన్టీఆర్‌.

ఇవి కూడా చదవండి:

************************************************

*Shaakuntalam: సినిమా సక్సెస్ కాలేదు కానీ.. ఆ విషయంలో మాత్రం తిరుగులేదు

*The India House: పవర్ ఫుల్ ఫిల్మ్‌తో ఖాతా తెరుస్తోన్న ‘V మెగా పిక్చర్స్’.. మోషన్ వీడియో అదిరింది

*Sharwanand: రోడ్డు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నారంటే?

*NTR Centenary: తారక రాముని శతజయంతి - శత విశేషాలు

*LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..

*NTR Centenary Celebrations: చిరంజీవి ఇలా.. పవన్ కల్యాణ్ అలా!

Updated Date - 2023-05-28T17:41:37+05:30 IST