Ramesh Babu as Samrat: సూపర్ స్టార్ కృష్ణగారి కుమారుడు ఆరంగేట్రం చేసిన రోజు

ABN , First Publish Date - 2023-10-02T13:20:29+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ గారు తన పెద్ద కుమారుడు రమేష్ బాబు ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ తీసిన 'సామ్రాట్' అనే సినిమా 36 సంవత్సరాల కిందట ఇదే రోజు విడుదలైంది. బాలకృష్ణ సినిమా టైటిల్ కూడా 'సామ్రాట్' అని పెట్టడంతో అప్పట్లో టైటిల్ ఒక పెద్ద వివాదం అయింది, అయితే చివరికి కృష్ణ గారు...

Ramesh Babu as Samrat: సూపర్ స్టార్ కృష్ణగారి కుమారుడు ఆరంగేట్రం చేసిన రోజు
Ramesh Babu and the poster of his debut film 'Samrat'

సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) కెరీర్ చాలా అద్భుతంగా వున్నప్పుడే తన పెద్ద కుమారుడు రమేష్ బాబు (RameshBabu) ని కూడా పరిశ్రమకి పరిచయం చెయ్యాలన్న ఉద్దేశంతో 'సామ్రాట్' #Samrat అనే సినిమా ప్లాన్ చేశారు. అయితే అప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా రమేష్ బాబు మూడు నాలుగు సినిమాల్లో చేసాడు. ముందుగా 'అల్లూరి సీతారామరాజు' #AlluriSeetharamaRaju సినిమాలో చిన్నప్పటి రామరాజు గా కనపడతాడు రమేష్ బాబు. అలాగే 'దొంగలకు దొంగ' #DongalakuDonga, 'మనుషులు చేసిన దొంగలు', 'అన్నదమ్ముల సవాల్' సినిమాలలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా వేసాడు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'నీడ' సినిమాలో కూడా రమేష్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు.

rameshbabu.jpg

కానీ కృష్ణ గారు, తన కుమారుడిని చాలా పెద్దగా పరిశ్రమకి పరిచయం చెయ్యాలని అనుకొని, కథల కోసాం వెతికారు. అప్పట్లో హిందీ సినిమా 'బేతాబ్' #Betaab ఒక సంచలనం సృష్టించింది. అది 1983లో విడుదలైంది, సన్నీ డియోల్ (SunnyDeol) ఈ సినిమాతో పరిచయం అయ్యారు. కృష్ణ గారు ఆ 'బేతాబ్' సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని నిశ్చయించుకొని దర్శకుడిగా వి మధుసూధనరావు (VMadhusudhanaRao) ని పెట్టి సినిమా తీశారు. ఇందులో సోనమ్ (Sonam) అనే హిందీ అమ్మాయిని కథానాయికగా పరిచయం చేశారు కృష్ణ గారు.

samrat-rameshbabu1.jpg

ఈ సినిమా తన సొంత బ్యానర్ అయినా పద్మాలయ స్టూడియోస్ #PadmalayaStudios మీదే నిర్మించారు. కృష్ణ గారి సోదరులు హనుమంతరావు నిర్వహణ, ఇంకో తమ్ముడు ఆదిశేషగిరి రావు (AdiseshagiriRao) నిర్మాతగా ఈ సినిమా 2-10-1987 అంటే ఇప్పటికి 36 సంవత్సరాల క్రితం ఇదేరోజు (గాంధీ జయంతి రోజు) విడుదలైంది. సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న కృష్ణ గారు తన కుమారుడు రమేష్ బాబు ని తన వారసుడిని పరిచయం చేస్తూ విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది అని అంటారు. ఆ తరువాత రమేష్ బాబు కొన్ని హిట్ సినిమాలు ఇచ్చినా, ఎక్కువ కాలం పరిశ్రమలో నిలబడలేకపోయారు. గత సంవత్సరం 56 ఏళ్ల వయసులో రమేష్ బాబు అనారోగ్య సమస్యలతో మరణించారు. అతని తమ్ముడు మహేష్ బాబు (MaheshBabu), కృష్ణ గారి వారసత్వం పుచ్చుకొని సూపర్ స్టార్ గా పరిశ్రమలో వెలుగొడుతున్నాడు.

sahasa-samrat.jpg

టైటిల్ వివాదం

అయితే ఈ సినిమా టైటిల్ వివాదాస్పదం అయింది. అంతకు ముందు నిర్మాత కెసి శేఖర్ బాబు (KCSekharBabu), నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) తో 'సామ్రాట్' #Samrat అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తున్నాను అని చెప్పారు. ఈ సినిమాకి రాఘవేంద్ర రావు (KRaghavendraRao) దర్శకుడు. అయితే కృష్ణ గారు 'సామ్రాట్' టైటిల్ తాను ముందు రిజిస్టర్ చేయించానని చెప్పినా, శేఖర్ బాబు వినకుండా అదే టైటిల్ తో తన సినిమా షూటింగ్ మొదలెట్టేసాడు. రెండు సినిమాలు 'సామ్రాట్' అనే టైటిల్ తో ప్రచారం కూడా చేశారు. అప్పట్లో పరిశ్రమలో ఇదొక పెద్ద సంఘటన అయింది. అప్పుడు పరిశ్రమలోని కొంతమంది పెద్దలు నిర్మాత శేఖర్ బాబు కి సర్ది చెప్పటం తో అతను తన సినిమాని 'సాహస సామ్రాట్' గా మార్చుకున్నారు అని చెపుతూ వుంటారు. అయితే ఇక్కడ ఆసక్తికరం ఏంటంటే టైటిల్ కోసం ఇంత తాపత్రయ పడిన బాలకృష్ణ సినిమా అదే సంవత్సరం ముందు ఏప్రిల్ నెలలో విడుదలైంది, పెద్ద ఫ్లాప్ కూడా అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర.

Updated Date - 2023-10-02T13:20:29+05:30 IST