Adipurush on OTT: ఆదిపురుష్ ఓటిటి లో ఎప్పుడో తెలుసా....
ABN , First Publish Date - 2023-06-14T12:23:12+05:30 IST
'ఆదిపురుష్' సినిమాకి బాగా హైప్ వచ్చింది. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ జంట రాముడు, సీతగా కనపడనున్నారు. ఇందులో గ్రాఫిక్స్ తో యుద్ధ సన్నివేశాలు బాగా చిత్రీకరించారని అంటున్నారు. మరి ఈ సినిమా ఓటిటి లో ఎప్పుడు వస్తుందో తెలుసా...
ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) రాముడు, సీత పాత్రలతో రామాయణం ఆధారంగా తీసిన సినిమా 'ఆదిపురుష్' #AdipurushOnJune16 ఈనెల 16న థియేటర్స్ లో విడుదల అవుతోంది. ఓం రౌత్ (OmRaut) దీనికి దర్శకుడు. ఈ సినిమాకి ఇప్పటికే బాగా హైప్ వచ్చింది. ఇందులో రావణాసురిడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) వేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇందులో వార్ ఎపిసోడ్ 30 నిముషాల పాటు ఉంటుందని, ఆ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ప్రభాస్ సినిమా ఓటిటి లో ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈమధ్య థియేటర్స్ లో విడుదల అయిన సినిమాలు తొందరగానే ఓటిటి లో వచ్చేస్తున్నాయి కాబట్టి, ఈ 'ఆదిపురుష్' #Adipurush కూడా తొందరగానే వచ్చేస్తుంది అని చాలామంది ఎదురు చూస్తున్నారు.
కానీ 'ఆదిపురుష్' సినిమా థియేటర్ లో విడుదల అయిన ఎనిమిది వారల తరువాత మాత్రమే ఓటిటి లో వస్తుంది అని చిత్ర నిర్వాహకులు చెప్పారు. ఎందుకంటే ఈ సినిమాని థియేటర్ లోనే ఆస్వాదించాలని, అందుకు తగ్గట్టుగా అన్ని హంగులతో తీశామని, ఈ సినిమాకి సుమారు రూ 500 కోట్ల వరకు ఖర్చు పెట్టారని అంటున్నారు. అందువల్ల ఈ సినిమాని కేవలం థియేటర్ లో మాత్రమే చూస్తే ఆ అనుభవం వేరుగా ఉంటుందని చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు. ఈ సినిమా ఓటిటి అమెజాన్ ప్రైమ్ (AmazonPrime) భారీ రేటుకు తీసుకుందని,అక్కడే ఎనిమిది వారల తరువాత ఈ సినిమాని చూడొచ్చు అని కూడా అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండూ ఈ సినిమా కోసం సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా టికెట్ ధర 50 రూపాయలు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చిందని తెలిసింది. అందుకనే నిన్నటివరకు ఈ సినిమా టికెట్స్ ఆన్ లైన్ లో విక్రయించలేదని, ఇప్పుడు ఆన్ లైన్ లో విక్రయించుకోవచ్చని తెలిసింది.