Agent: ‘ఏజెంట్’ని వదలని కష్టాలు.. ఓటీటీలో విడుదల డౌటే.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-09-27T21:37:30+05:30 IST
అఖిల్ అక్కినేని హీరోగా.. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ‘ఏజెంట్’ చిత్ర ఓటీటీ విడుదలకు ఇంకా అడ్డంకులు తొలగలేదు. నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ.. న్యాయం కోరుతూ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళారు. ఆయన వాదనలు విన్న తర్వాత ఈ నెల 29న ‘ఏజెంట్’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే ఇచ్చిందని అడ్వకేట్ కేశాపురం సుధాకర్ తెలిపారు.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా.. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మించిన ‘ఏజెంట్’ (Agent) చిత్ర ఓటీటీ విడుదలకు ఇంకా అడ్డంకులు తొలగలేదు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ని సొంతం చేసుకోవడంతో.. జనాలు పెద్దగా ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ పెట్టలేదు. అయితే.. అదే టైమ్‌లో ఓటీటీలో వచ్చి ఉంటే మాత్రం.. ‘ఏజెంట్’కు మంచి ఆదరణ దక్కేది. ఎందుకంటే.. ‘ఏజెంట్’ ఓటీటీ విడుదల కోసం జనాలు అలా వేచి చూశారు. కానీ, సోనీలివ్ మొదట అనౌన్స్ చేసిన తేదీకి ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఏవో మార్పులు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి చర్చలు నడిచాయి. కానీ సినిమా మాత్రం విడుదల కాలేదు. తాజాగా ఈ చిత్రం ఈ నెల 29న స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా సోనీలివ్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ తేదీకి కూడా ‘ఏజెంట్’ ఓటీటీలోకి రావడం కష్టమే అని తెలుస్తోంది. కారణం ఏమిటంటే.. (Again Doubts on Agent OTT Release)
‘ఏజెంట్’ విడుదల టైమ్‌లో వైజాగ్‌కు చెందిన పంపిణీదారుడు బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్)కు, చిత్ర నిర్మాతకు.. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో గొడవలు జరిగినట్లుగా సదరు పంపిణీదారుడు మీడియా ముఖంగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఇదే నిర్మాత నిర్మించిన ‘భోళాశంకర్’ (Bholaa Shankar) చిత్ర విడుదల టైమ్‌లో కూడా డిస్ట్రిబ్యూటర్ సతీష్.. లాయర్‌తో కలిసి హడావుడి చేశారు. ఇప్పుడు ‘ఏజెంట్’ ఓటీటీలో విడుదల కాబోతోన్న సందర్భంగా.. నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ.. న్యాయం కోరుతూ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళారు. ఆయన వాదనలు విన్న తర్వాత ఈ నెల 29న ‘ఏజెంట్’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే ఇచ్చిందని అడ్వకేట్ కేశాపురం సుధాకర్ తెలిపారు. దీంతో మరోసారి ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై అనిశ్చితి నెలకొంది. (Agent OTT Release)
అఖిల్ ‘ఏజెంట్’ (Akhil Agent Movie) విషయంలో ఇలా జరగడం ఇది రెండో సారి. ఇంతకు ముందు కూడా ఇలానే డేట్ ప్రకటించి.. అంతా వేచి చూస్తుండగా.. ఎటువంటి కారణాలు చెప్పకుండా సినిమాని ఓటీటీలో విడుదల కాకుండా ఆపేశారు. ఇప్పుడు.. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ రూపంలో.. ఈ సినిమాకు అడ్డుపడటంతో.. ఇప్పటి వరకు ఉన్న ఆశలు కూడా ఆవిరైపోయాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందనేది చెప్పడం కష్టమే. చూద్దాం.. 29న ఏం జరుగుతుందో..
ఇవి కూడా చదవండి:
============================
*Pawan Kalyan: జనసేనకు స్టంట్ మేన్ బద్రి విరాళం
*************************************
*Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి స్పెషల్ సర్ప్రైజ్.. ఎప్పుడంటే?
**********************************
*Vishal: అదోరకం సనాతన ధర్మం.. విశాల్ వ్యాఖ్యలకు నిర్మాత కౌంటర్
**********************************
*Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది
***********************************