Bigg Boss Telugu 7: హౌస్ లో అందరినీ ఏడిపిస్తున్న బిగ్ బాస్

ABN , First Publish Date - 2023-11-08T17:34:03+05:30 IST

బిగ్ బాస్ ఇంట్లో ఈ వారం అంతా ఏడుపులతో నిండిపోతోంది అనిపిస్తోంది. ఒక్కో హౌస్ మేట్ తన కుటుంబ సభ్యులను చూడగానే భావోద్వేగానికి గురై కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు.

Bigg Boss Telugu 7: హౌస్ లో అందరినీ ఏడిపిస్తున్న బిగ్ బాస్
Priyanka Jain in Bigg Boss House

బిగ్ బాస్ తెలుగు 7 #BiggBossTelugu7 సీజన్ అప్పుడే 66 వ రోజులోకి అడుగు పెట్టేసింది. ఈవారం అంతా బిగ్ బాస్ హౌస్ లో వుండే సభ్యులనే కాకుండా, చూస్తున్న ప్రేక్షకులని కూడా భావోద్వేగానికి గురి చేస్తున్నాడు. ఈవారం బిగ్ బాస్ కుటుంబ సభ్యుల కలయికని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి సుమారు పది వారాలు అయిపోతోంది, అందుకనే ఒక్కో సభ్యుడు తమ కుటుంబం నుండి ఒకరిని కలిసే ఏర్పాటు చేసాడు బిగ్ బాస్. #BiggBoss

biggbosssivaji.jpg

ఇందులో భాగంగానే నిన్న నటుడు శివాజీ (Sivaji) కుమారుడు డాక్టర్ గా వచ్చి శివాజీని ఆరోగ్యం గురించి వాకు చేసినట్టుగా అతని ఆరోగ్యం గురించి అడిగాడు. అయితే డాక్టర్ అవుట్ ఫైట్స్ వేసుకోవటం, దానికితోడు మాస్క్ కూడా పెట్టుకోవటంతో శివాజీ తన కుమారుడిని నిజంగానే డాక్టర్ అనుకున్నాడు, అలాగే మాట్లాడేడు. కానీ తరువాత 'నాన్నా' అని పిలిచేసరికి శివాజీ ఒక్కసారిగా షాకు అయ్యి, వెంటనే భావోద్వేగంతో ఏడ్చేశాడు.

bigbosstelugupriyankajain.jpg

ఈరోజు ఇంకో హౌస్ మేట్ ప్రియాంక జైన్ (PriyankaJain) ప్రియుడిని హౌస్ లోకి పంపాడు బిగ్ బాస్. అతడిని చూడగానే ప్రియాంక జైన్ ఇంకా భావోద్వేగం తట్టుకోలేక కళ్లనీళ్లు పెట్టుకుంది. అదీ కాకుండా సుమారు రెండు నెలల నుండి బయట వ్యక్తులను చూడకుండా ఆ హౌస్ లోనే ఉండటం, ఒక్కసారిగా తనవారు అనుకున్న వ్యక్తి రావటంతో భావోద్వేగానికి గురి కావటం సహజం. ప్రియాంక జైన్ కూడా తన ప్రియుడిని చూడగానే అతడిని హాగ్ చేసుకుంది, ముద్దులతో ముంచెత్తింది. అతను గులాబీ పువ్వు ఇచ్చి ప్రియాంకకి ప్రపోజ్ చెయ్యడం, హౌస్ లోనే పెళ్లి చేసుకుందాం అని ఆమె చెప్పడం ఆసక్తికరంగా వుంది. వాళ్ళిద్దరి రొమాన్స్ కి ఇంకో సభ్యుడు ఏదైనా అడ్డం పెట్టాలా అని అనటంతో నవ్వులు విరిశాయి.

biggbosstelugugautam.jpg

అలాగే ఇంకో సభ్యుడు అయిన గౌతమ్ (Gautham) తల్లి హౌస్ లోకి వచ్చింది. 'కన్నయ్య పంచె వచ్చిందా' అని మాటలు వినపడగానే, గౌతమ్ ఎక్కడనుండి వస్తున్నాయో అని అటూ ఇటూ తిరిగి, వెంటనే తల్లి లోపలి రాగానే భావోద్వేగానికి గురయ్యాడు, కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. తరువాత గౌతమ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉందని, అందులో అమ్మాయిలు ఇంకా ఎక్కువ ఫాలో అవుతున్నారని గౌతమ్ తల్లి చెప్పారు. చాల హ్యాండ్ సమ్ గా వున్నాడు అని చెప్పింది కొడుకు గురించి. ఇలా వరసగా హౌస్ మేట్స్ కుటుంబ సబ్యులని హౌస్ లోకి పంపి బిగ్ బాస్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Updated Date - 2023-11-08T17:34:06+05:30 IST