Srikanth: మత్స్యకారుల జీవన విధానాన్ని తెలిపే చిత్రమిది
ABN , First Publish Date - 2023-06-29T11:45:46+05:30 IST
అజయ్ ఘోష్, శుభోదయం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము వంటి వారు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రుద్రమాంబపురం’. మూలవాసుల కథ అనేది ట్యాగ్‌లైన్
అజయ్ ఘోష్, శుభోదయం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము వంటి వారు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రుద్రమాంబపురం’ (Rudramambapuram). మూలవాసుల కథ అనేది ట్యాగ్‌లైన్. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు. మహేష్ బంటు దర్శకుడు. మూల కథ అజయ్ ఘోష్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి ఆదరణ లభించగా.. తాజాగా ఈ మూవీలోని జాతర సాంగ్ (Jatara Song)ను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాటను ఆస్కార్ అవార్డు వచ్చిన ‘నాటు నాటు’ పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్ పాడగా, భాష్యశ్రీ సాహిత్యం అందించారు. వెంగి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం జూలై 6 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
జాతర సాంగ్ విడుదల చేసిన అనంతరం హీరో శ్రీకాంత్ (Hero Srikanth) మాట్లాడుతూ.. ఎన్.వి.ఎల్.ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం, ములవాసుల కథ. ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలతో యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారని తెలిసింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. తిరుపతి పాత్రలో అజయ్ గోష్.. పెద్దకాపు మల్లోజుల శివయ్య పాత్రలో శుభోదయం సుబ్బారావు నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Number One: ఇక కృష్ణ పని అయిపోయిందనుకునే టైమ్‌లో.. చిరు, నాగ్‌లకు షాకిస్తూ..!
**************************************
*Bro: బ్రో వచ్చాడు.. డబ్బింగ్ చెప్పేశాడు.. టీజర్‌కి లైన్ క్లియర్ చేసేశాడు
**************************************
*VJ Sunny: విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న న్యూ పార్టీ ఇదే..
**************************************