Rudrangi: జగపతిబాబు తెలంగాణ నేపథ్యంలో నటించిన సినిమా ఓటిటిలో చూడొచ్చు
ABN , First Publish Date - 2023-08-01T14:11:53+05:30 IST
జగపతి బాబు నటించిన తాజా సినిమా 'రుద్రంగి' ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ నేపధ్యం స్వతంత్రం రాకముందు తెలంగాణలో పరిస్థితి ఎలా వుంది, దొరల పాలన అప్పటి ప్రజలు ఎలా తిరుగుబాటై చేశారు అన్నవి ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు అజయ్ సామ్రాట్
జగపతిబాబు (JagapathiBabu) ఈమధ్య చాలా సినిమాల్లో కనిపిస్తున్నా, అతనికి మంచి పేరు తెచ్చే సినిమా మాత్రం ఈమధ్యనే విడుదలైన 'రుద్రంగి' #Rudrangi అని చెప్పొచ్చు. ఈ సినిమా తెలంగాణా నేపథ్యంలో స్వతంత్రం రాకముందు జరిగిన కథగా చిత్ర నిర్వాహకులు తీశారు. ఇందులో జగపతి బాబు దొర గా నటించారు. అతనితో పాటు మమతా మోహన్ దాస్ (MamtaMohanDas), విమల రామన్ (VimalaRaman) కూడా నటించారు. ఇది జులై 7 న థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాలో జగపతి బాబు నటనకి మంచి పేరొచ్చింది కానీ, ఈ సినిమాకి తగినంత ప్రచారం లేకపోవటం వలన ఈ సినిమా అంతగా ప్రజాదరణ పొందలేదు అని విమర్శకులు అంటున్నారు.
ఈ సినిమాకి అజయ్ సామ్రాట్ (AjaySamrat) దర్శకత్వం వహించాడు, అలాగే బిఆర్ఎస్ ఎమ్ఎల్ఏ రసమయి బాలకిషన్ (RasamayiBalakishan) ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ప్రచారానికి మినిస్టర్ హరీష్ రావు (HarishRao), అలాగే నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) కూడా వచ్చారు. ఈ సినిమా తెలంగాణ గడిలలో అప్పట్లో ఎలా ఉండేది, దొరలు గ్రామ ప్రజలను ఏ విధంగా దోచుకునేవారు ఇలాంటి సన్నివేశాలతో దర్శకుడు ఆసక్తికరంగా తీసాడు కానీ, సినిమా మాత్రం అంతగా ప్రజాదరణ పొందలేదు.
ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (AmazonPrimeVideo) లో స్ట్రీమింగ్ అవుతోంది. మామూలుగా అయితే ఏ సినిమా అయినా స్ట్రీమింగ్ అయ్యే ముందు కొంచెం ముందుగా ప్రచారం చేస్తారు కానీ, ఈ సినిమా ఎటువంటి ప్రకటనలు లేకుండానే డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో (AmazonPrimeVideo) లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.