OTT: ఓటీటీలోకి పొలిమేర 2.. ఎప్ప‌టి నుంచంటే?

ABN , First Publish Date - 2023-11-29T13:38:27+05:30 IST

ఓటీటీ ప్రేక్ష‌కులు ఎప్రుడెప్పుడా అని ఎదురు చేస్తున్న స‌మ‌యం వ‌చ్చింది సినీ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సినిమా మా ఊరి పొలిమేర 2 డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ది.

OTT: ఓటీటీలోకి పొలిమేర 2.. ఎప్ప‌టి నుంచంటే?
POLIMERA 2

ఓటీటీ ప్రేక్ష‌కులు ఎప్రుడెప్పుడా అని ఎదురు చేస్తున్న స‌మ‌యం వ‌చ్చింది సినీ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సినిమా మా ఊరి పొలిమేర 2 (Polimera2) సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ది. న‌వంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా నాలుగు వారాలైన‌ప్ప‌టికీ ఇంకా విజ‌య‌వంతంగా న‌డుస్తూ దాదాపు రూ50 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాసింది.

మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ పొలిమేర మొద‌టి భాగం ఓటీటీలో విడుద‌ల‌వ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో రెండో భాగాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌గా ఓటీటీని మించి ఆద‌ర‌ణ‌ను తెచ్చుకుంది. మౌత్‌టాక్ బాగా స్ప్రెడ్ అవ‌డంతో పోటీ చిత్రాల‌ను సైతం త‌ట్టుకుని విజ‌య‌దుందుబి మ్రోగించింది.


అయితే ఇప్పుడు ఈ మా ఊరి పొలిమేర 2 (Polimera2) ఉ సినిమా రిలీజై 4 వారాలు దాటి 30 రోజులు కావ‌స్తుండ‌డంతో సినిమాను ఓటీటీలోకి తేచ్చేందుకు డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. డిసెంబ‌ర్ 8న‌ గానీ 15 నుంచి గానీ స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Updated Date - 2023-11-29T13:38:28+05:30 IST