Bigg Boss Telugu 7: శివాజీ వెన్నుపోటు, ప్రశాంత్ ని కెప్టెన్ గా పనికిరావు అన్న బిగ్ బాస్..

ABN , First Publish Date - 2023-10-11T15:04:33+05:30 IST

ప్రశాంత్ కి కెప్టెన్సీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసేసాడు బిగ్ బాస్. హౌస్ లో సభ్యులు కూడా ప్రశాంత్ కి వ్యతిరేకంగా చెప్పడంతో కెప్టెన్సీ పోయిన ప్రశాంత్ ఒక్కసారిగా కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

Bigg Boss Telugu 7: శివాజీ వెన్నుపోటు, ప్రశాంత్ ని కెప్టెన్ గా పనికిరావు అన్న బిగ్ బాస్..
Pallavi Prashanth is crying after lost his captaincy in Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 7 #BiggBossTelugu7 సీజన్ ఇప్పుడిప్పుడే కొంచెం ఆసక్తికరంగా మారుతోంది అనిపిస్తోంది. కొత్తగా కొంతమంది హౌస్ లోకి అడుగు పెట్టడం, అలాగే గౌతమ్ (Gautam) సీక్రెట్ రూము నుండి మళ్ళీ హౌస్ లోకి వచ్చి, మిగతా సబ్యులని ఆడుకోవటం లాంటివి చూస్తుంటే హౌస్ లో ఇప్పుడే గేమ్ మొదలయినట్టుగా కనపడుతోంది. ఒక పక్క పల్లవి ప్రశాంత్ (PallaviPrashanth) ని హౌస్ కెప్టెన్ గా చేశారు. అతను మొక్క దగ్గర కూర్చొని, తన కెప్టెన్ బ్యాడ్జ్ ని అక్కడ పెట్టి చూసుకొని మురిసిపోతూ ఉంటాడు.

హౌస్ లో అందరికంటే సీనియర్ అయిన శివాజీ (Sivaji) అది చూసి, 'నిన్నెవడురా ఆపేది' అంటాడు. ఆలా మొదలయిన ప్రచార చిత్రం, ఇంకేముందు ఇంటి సభ్యులు అందరూ ప్రశాంత్ ని కెప్టెన్ గా పనికి రాడు అని చెప్పారు. బిగ్ బాస్ ఇక హౌస్ లో ఒక్కొక్కరినీ కెప్టెన్ అనేవాడు ఎలా ఉండాలి అతని బాధ్యతలు ఏంటి అనే విషయాల మీద అభిప్రాయాలు అడిగితే అందరూ ఒక్కొక్క రకంగా సమాధానం చెపుతూ ప్రశాంత్ పనికిరాడు కెప్టెన్ గా అని తేల్చి చెప్పేసారు.

biggboss7telugu1.jpg

'నిన్నెవడురా ఆపేది' అని ప్రశాంత్ తో మొదట్లో అన్న శివాజీ కూడా చివరికి వచ్చేసరికి, కెప్టెన్ గా ప్రశాంత్ అస్సలు పనికి రాడు అని వెన్నుపోటు పొడిచినట్టుగా చెప్పేసాడు. ప్రశాంత్ హౌస్ లో ఒక సామాన్య వ్యక్తి, మిగతా వాళ్ళు అందరూ ఇంతో అంతో పేరున్న సెలబ్రిటీస్, మరి ప్రశాంత్ చెపితే వాళ్ళు వింటారా అనే సందేహం నెటిజన్స్ వ్యక్తపరిచారు. అదీ కాకుండా ప్రశాంత్ కూడా ఒప్పేసుకున్నాడు, తన మాట ఎవరూ వినడటం లేదని. అయినా కూడా బిగ్ బాస్ ఇంకో రోజు చూసి కెప్టెన్ పదవి తీసేస్తే బాగుండేది అని అంటున్నారు. పాపం ప్రశాంత్ కి కెప్టెన్ వచ్చినంత ఆనందం ఎంతోసేపు వుండలేదు, వెంటనే లాగేసుకోవటంతో కళ్ళ నీళ్లు పెట్టుకొని బావురుమన్నాడు.

అతనికి సపోర్ట్ గా ఎవరూ రాకపోవటం ఆశ్చర్యకరం. అదేంటి కెప్టెన్ గా అతను ఫెయిల్ అయితే చెప్పాలి గానీ, వెంటనే ఎలా తీసేస్తారు అని అందుగుతున్నారు నెటిజన్స్. అదీ కాకుండా హౌస్ లో అందరూ ఒక్కటయ్యిపోయి ప్రశాంత్ ని కావాలని కెప్టెన్సీ నుండి తీసేసినట్టు చేశారు అని కూడా అంటున్నారు. మరి ఈరోజు ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో చూడాలి. నాగార్జున (Nagarjuna) ఈ షో ని హోస్ట్ చేస్తున్నారు.

Updated Date - 2023-10-11T15:04:33+05:30 IST