OTT: తెలుగు ‘మండేలా’.. మార్టిన్ లూథర్ కింగ్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ABN , First Publish Date - 2023-11-21T14:20:27+05:30 IST
తమిళంలో చిన్న సినిమాగా విడుదలై రెండు జాతీయ అవార్డును గెలుచుకుని ఆశ్చర్యపర్చిన మండేలా సినిమాను ఇటీవల మార్టిన్ లూథర్ కింగ్ పేరుతో తెలుగులో రిమేక్ చేసి విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తమిళంలో యోగి బాబు చేసిన పాత్రను తెలుగులో సంపూర్ణేశ్ బాబు చేశాడు. పూజా ఆపర్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా నరేశ్, వెంకటేశ్ మహా కీలక పాత్రలు పోసించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను నవంబర్ 29న డిజిటల్ స్ట్రీమింగ్‌కు తెస్తున్నట్లు ప్రకటించారు.
తమిళంలో చిన్న సినిమాగా విడుదలై రెండు జాతీయ అవార్డును గెలుచుకుని ఆశ్చర్యపర్చిన మండేలా సినిమాను ఇటీవల మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King) పేరుతో తెలుగులో రిమేక్ చేసి విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తమిళంలో యోగి బాబు చేసిన పాత్రను తెలుగులో సంపూర్ణేశ్ బాబు (Sampoornesh Babu) చేశాడు. పూజా ఆపర్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా నరేశ్, వెంకటేశ్ మహా కీలక పాత్రలు పోసించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను నవంబర్ 29న డిజిటల్ స్ట్రీమింగ్‌కు తెస్తున్నట్లు ప్రకటించారు.
చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమాగా పేరు తెచ్చుకుని ప్రముఖులు, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం కరెక్టుగా తెలంగాణలో ఎన్నికలు మరో నెలలో జరగనున్న సమయంలోనే ఆక్టోబర్ 27న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఔట్ అండ్ ఔట్ కామెడీ, పొలిటికల్ సెటైర్‌తో, ఓటు విలువను తెలిపే మంచి సందేశంతో రూపొందిన ఈ సినిమాకు తమిళనాట వచ్చినంత స్పందన మన తెలుగునాట దక్కక పోవడం గమానార్హం.
అయితే ఇప్పుడు యాదృశ్చికంగా ఈ సినిమాను నవంబర్ 29న సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నారు. అయితే తెల్లారితే తెలంగాణలో ఎన్నికలున్న సమయంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. ఈ సినిమా చూసిన వారు ఒక్కరైనా ఓటు విలువ తెలుసుకుంటారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.థియేటర్లలో ఈ సినిమాను మిస్సైన వారు ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే చూసి హాయ్ గా ఎంజాయ్ చేయవచ్చు.