Bigg Boss 7: యావర్ కి పేడతో మొహం మీద కొట్టారు, నువ్వు బక్వాస్ కారణం చెప్పావన్న శోభాశెట్టి
ABN , First Publish Date - 2023-09-20T17:25:46+05:30 IST
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో మూడో వారం వచ్చేసరికి గట్టిగా అరుపులు, కేకలు మొదలయ్యాయి. గౌతమ్, శోభాశెట్టి ల మధ్య వాదోపవాదాలు జరిగి, ఇద్దరూ బాగా అరుచుకున్నారు. ఇక యావర్ కి అయితే పేడ నీళ్లు కొట్టారు, ఇవన్నీ ఈరోజు ఎపిసోడ్ లో...
నాగార్జున (NagarjunaAkkineni) హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 #BiggBossTelugu7 సీజన్లో ఇప్పుడు కొత్త టాస్క్ లు మొదలయ్యాయి, అలాగే గౌతమ్ (Gautam), శోభాశెట్టి (ShobhaShetty) ల మధ్య గొడవ పెరిగి ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకునేంతవరకు వెళ్ళింది. బిగ్ బాస్ కొత్త టాస్క్ లో కంటెండర్ అవ్వాలంటే ఇంటిలో మిగతా సభ్యులు అతన్ని ఏమి చేసినా, అతను మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలని షరతు పెట్టాడు బిగ్ బాస్. దానితో యావర్ (PrinceYawar) తన గెడ్డంని ఒక బల్లమీద ఆనించి నిలుచుంటే, అతని మీద కోడిగుడ్డు కొట్టారు, నీళ్లు పోశారు, ఆఖరికి పేడ కూడా కొట్టారు. అయినా యావర్ కదలకుండా అలానే నిలుచుని తన మొహాన్ని ఒక్క అంగుళం కూడా పక్కకి జరపలేదు.
ఇక శోభాశెట్టి, గౌతమ్ ల మధ్య గొడవ అరుచుకునే వరకు వెళ్ళింది. గౌతమ్ బాడీ గురించి శోభాశెట్టి ఎదో అనింది అని, గౌతమ్ నేను జిమ్ చేస్తే నీకేంటి ప్రాబ్లెమ్ అని శోభాశెట్టి ని అడిగాడు. తన షర్టు విప్పి మొత్తం బాడీని చూపించాడు. నీ బాడీ ని ఎందుకు చూపిస్తున్నావు అని శోభాశెట్టి అడిగితే, దానికి గౌతమ్ రెచ్చిపోయి నా ఫిజిక్ అనడానికి నువ్వెవరు అని గట్టిగా అరిచాడు. శోభాశెట్టి కూడా పెద్దగా అరుస్తూ నువ్వు బక్వాస్ కారణం చెప్పావు, అందుకే నేను అన్నాను అని తను కూడా గట్టిగా అరిచింది.
నేను పొద్దున్న ఎత్తుతా, ఈవెనింగ్ ఎత్తుతా, నైట్ ఎత్తుతా , నా బాడీ నా ఇష్టం అని గౌతమ్ బరువులు ఎత్తుతూ శోభాశెట్టి ఎదురుగా జిమ్ చెయ్యడం మొదలెట్టాడు. దానికి శోభాశెట్టి కూడా ఎత్తు అని అరుస్తోంది. మిగతా ఇంటి సభ్యులు అందరూ చాలా గంభీరంగా, సైలెంట్ గా వీళ్లిద్దరు అరుచుకుంటూ ఉంటే చూస్తూ వున్నారు.