Aditi Shankar: శంకర్‌ కూతురు ఏం చెప్పిందంటే...

ABN , First Publish Date - 2023-07-13T18:39:03+05:30 IST

అదితి శంకర్‌ అగ్ర దర్శకుడు శంకర్‌ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. గాయని, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హీరో శివ కార్తికేయన్‌ సరసన ఆమె నటించిన ‘మహావీరుడు’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలు...

Aditi Shankar: శంకర్‌ కూతురు ఏం చెప్పిందంటే...

అదితి శంకర్‌(Aditi Shankar) అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. గాయని, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హీరో శివ కార్తికేయన్‌ సరసన ఆమె నటించిన ‘మహావీరుడు’ (Maha veerudu)చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలు...

అమ్మకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయంలో పాటలు పాడుతూ ఉంటారు ఆమెను చూస్తూ నేను కూడా సంగీతంపై దృష్టిపెట్టా. అమ్మ పాడిన పాటలను ఫోన్‌లో రికార్డ్‌ చేసుకుని నేనూ పాడేదాన్ని. అనుకోకుండా ఆ నేను పాడిన ట్రాక్‌ని తమన్‌ విని ‘గని’ సినిమాలో ‘రోమియోకి జూలియెట్‌లా’ పాట పాడే అవకాశం ఇచ్చారు. దీనికోసం తమన్‌ ప్రత్యేకంగా కవర్‌సాంగ్‌ షూట్‌ చేసి నన్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. నాన్న సినిమాల్లో ‘జెంటిల్‌మేన్‌’ చిత్రమంటే బాగా ఇష్టం. నాన్న సినిమాలన్నీ తెలుగులో కూడా విడుదలవుతాయి. ఆ క్రమంలో ఆయన కూడా తెలుగు నేర్చుకున్నారు. అలా నేను కూడా తెలుగు మీద పట్టు సాధించా.

ఇండస్ర్టీ పేరు ఎత్తకూడదన్నారు..

నాన్న దిగ్గజ దర్శకుడు. చిన్నప్పటి నుంచి షూటింగ్స్‌ చూసి నాకూ నటనతో ఆసక్తి పెరిగింది. హీరోయిన్‌ కావాలనే కోరికను బయటపెట్టకుండా నాన్న కోసం చదువుపై శ్రద్థ పెట్టా. ఎంబీబీఎస్‌లో చేరిన తర్వాత నా మనసులో మాటని నాన్నకు చెప్పా. అయితే వెంటనే శంకర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. ‘సినీ రంగంలో నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు. నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం నువ్వే ప్రయత్నించు. అందుకు ఏడాది సమయం ఇస్తున్నా. ఈ లోపు అవకాశాలు వేస్త ఓకే. లేదంటే ఇండస్ర్టీ పేరెత్తకూడదు’ అని షరతు పెట్టారు. ఆ కండీషన్‌కు ఓకే చెప్పి.. వరుస అవకాశాలు అందుకున్నా. నా తొలి చిత్రం కార్తి హీరోగా నటించిన ‘విరుమన్‌’. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రకి నప్పుతానో, లేదోనని హీరో కార్తి సందేహించారట. స్ర్కీన్‌ టెస్ట్‌లో మధునై యాసలో గలగలా మాట్లాడడంతో ఫిదా అతయి ఆ పాత్రకు ఎంపిక చేశారు. ఎంబీబీఎస్‌ చదువుతూనే ఈ సినిమాలో నటించా. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు దక్కింది. అలా ‘మావీరన్‌’లో అవకాశం దక్కించుకున్నా. శింబు సరసన ఓ చిత్రంలో నటిస్తున్నా.


2.jpgమహేశ్‌ నో చెప్పారు...

తెలుగులో నా అభిమాన నటుడు మహేశ్‌ బాబు. ఓ సారి నా సిస్టర్‌తో కలసి ముంబై వెళ్లా. అక్కడ మేం ఉన్న హోటల్‌లోనే మహేశ్‌ కూడా ఉన్నారు. ఆ విషయం తెలిసి ఆయన దగ్గరకు వెళ్లి ఆటోగ్రాఫ్‌-ఫొటో అడిగాను. ‘ఇది సందర్భం కాదమ్మా.. ఫ్యామిలీతో ఉన్నా’ అని మహేశ్‌ సున్నితంగా తిరస్కరించారు. అయినా బాధ కలగలేదు. ఆయనలో ఆ తత్వం నాకెంతో నచ్చింది. అయితే ఏం ఎవరమో ఆయనకు తెలీదు. తర్వాత ఎవరో ‘వాళ్లు శంకర్‌ కూతుళ్లని చెప్పడంతో మమ్మల్ని వెతికే ప్రయత్నం చేశారు. ఎలాగైతే మా గురించి తెలుసుకున్నారు. అక్కడే నాన్న కూడా ఉండడంతో జరిగిన విషయం చెప్పి సారీ చెప్పారట.

Updated Date - 2023-07-14T09:59:25+05:30 IST