Rajanikanth 170 : 46 ఏళ్ల తర్వాత.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా ఉంది!
ABN , First Publish Date - 2023-10-14T19:48:06+05:30 IST
తలైవా రజనీకాంత్ ప్రస్తుతం 170వ సినిమాతో బిజీగా ఉన్నారు. టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కేరళలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసి ప్రత్యేక సెట్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
తలైవా రజనీకాంత్ RajaniKanth 170) ప్రస్తుతం 170వ సినిమాతో బిజీగా ఉన్నారు. టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కేరళలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసి ప్రత్యేక సెట్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే, తిరునల్వేలి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు దీనిని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ ఊరుతో రజనీకాంత్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెబుతున్నారు. 1977లో ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ నటించిన చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం షూటింగ్ ఈ ప్రాంతంలోనే జరిగింది. ఆ తర్వాత ఆయన ఇప్పటి దాకా ఆ ప్రాంతానికి వెళ్లలేదట. 46 ఏళ్ల తర్వాత ‘తలైవా 170’ చిత్రం కోసం ఇప్పుడు తిరునల్వేలి వెళ్లారు. అలాగే రజనీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో ‘రాజాధిరాజా’ ఒకటి. 1988లో విడుదలైన ఈ చిత్రం తిరునల్వేలిలో వందరోజులు ఆడింది. అలాగే 1995లో రజనీకాంత్ ‘ముత్తు’ చిత్రం ఈ ప్రాంతంలో రెండు థియేటర్లలో ఒకేసారి విడుదలై, రెండు చోట్ల వందరోజులు పూర్తి చేసుకుంది.
దీంతో ఈ ప్రాంతం రజనీకాంత్‌కు ఎంతో స్పెషల్ అని చెబుతున్నారు. వారంరోజులుగా ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. రజనీకాంత్‌ను చూడడం కోసం అభిమానులు వేలాదిమంది షూటింగ్ జరిగే ప్రాంతానికి వస్తున్నారు. చిత్రీకరణ తర్వాత ఆయన వాళ్లందరితో కాసేపు ముచ్చటిస్తున్నారు. అందుకు ఎంతో ఆనందంగా ఉందని నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో ఇందులో మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన, మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు.