Anikha Surendran: డైలాగుల విషయంలో చాలా కష్టపడ్డా

ABN , First Publish Date - 2023-02-09T15:35:45+05:30 IST

దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి బాలనటిగా అడుగుపెట్టి గుర్తింపు పొందిన కేరళ నటి అనికా సురేంద్రన్‌ (Anikha Surendran). స్టార్‌ హీరో అజిత్‌ (Ajith) నటించిన ‘విశ్వాసం’ (Viswasam) చిత్రంలో ఆయన కుమార్తెగా..

Anikha Surendran: డైలాగుల విషయంలో చాలా కష్టపడ్డా
Anikha Surendran

దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి బాలనటిగా అడుగుపెట్టి గుర్తింపు పొందిన కేరళ నటి అనికా సురేంద్రన్‌ (Anikha Surendran). స్టార్‌ హీరో అజిత్‌ (Ajith) నటించిన ‘విశ్వాసం’ (Viswasam) చిత్రంలో ఆయన కుమార్తెగా నటించి, ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి ముందు, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ఇండస్ర్టీలో మాత్రం అజిత్‌ కుమార్తెగా అనికా గుర్తింపు పొందింది. దీనికి కారణం ఆ చిత్రంలో ఈ భామ నటనే కారణం. ఈ నటి తాజాగా హీరోయిన్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించింది.

anika1.jpg

‘‘మలయాళంలో విడుదలైన ‘బుట్టబొమ్మ’ (Buttabomma) చిత్రాన్ని తెలుగులోకి రీమేక్‌ చేయగా, డైలాగులు చెప్పడానికి ఎంతో కష్టపడ్డాను. ప్రతి డైలాగును చిత్ర బృందం వివరించారు. నటన అంటే నాకు అమితమైన ఇష్టం. బాల్యం నుంచే ముమ్ముట్టి, అజిత్‌, నయనతార, మమతా మోహన్‌దా్‌స వంటి స్టార్‌ హీరోహీరోయిన్లతో కలిసి నటించడంతో వారి నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను. వారంతా ఉన్నతస్థాయికి చేరుకున్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకునేందుకు తపనపడుతూ కష్టపడుతున్నారు. నాకు ఎమోషనల్‌ చిత్రాల్లో నటించడం ఇష్టం. అలాంటి కథా చిత్రాల్లో నటించే ఛాన్స్‌ వస్తే మాత్రం మిస్‌ చేసుకోను. థియేటర్ల తరహాలోనే ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలకు కూడా ఆదరణ లభిస్తుంది. ఇది మంచి శుభపరిణామం’’ అని అనికా సురేంద్రన్‌ అభిప్రాయపడింది.

Updated Date - 2023-02-09T15:35:47+05:30 IST