Chinmayi: వైరముత్తుని శిక్షించాలి... గాయని ఫైర్
ABN , First Publish Date - 2023-05-30T12:44:33+05:30 IST
కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తును (vairamuthu) ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి (Chinmayi) . గతంలో తనతోపాటు పలువురు మహిళలను వైరముత్తు వేధించారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తును (vairamuthu) ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి (Chinmayi) . గతంలో తనతోపాటు పలువురు మహిళలను వైరముత్తు వేధించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమంలో గొంతెత్తిన ఆమె వైరముత్తుపై తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను (Tweet to Stalin) కోరారు. దేశానికి గౌరవం తీసుకొచ్చిన రెజ్లర్స్‌ను మానసికంగా, లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత నెల 23 నుంచి రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన (Wrestler protest) sచేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం ఏమాత్రం స్పందించకపోవడంతో నూతన పార్ల్లమెంటు భవన ప్రారంభోత్సవం వద్ద ఆందోళన నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో రెజ్లర్లకు పోలీసులకు మధ్య ఘర్ణణ మొదలైంది. దీనిని ఉద్దేశిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. రెజ్లర్లకు మద్దతుగా మాట్లాడారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. రెజ్లర్లకు స్టాలిన్ మద్దతిస్తూ చేసిన ట్వీట్‌ను ఉద్దేశిస్తూ ఆమె ట్వీట్ చేశారు. వైరముత్తు మంచి వాడు కాదని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ స్టాలిన్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, రెజ్లర్ల ఆవేదన అర్థం చేసుకున్నట్టుగానే తమ ఆవేదన సైతం అర్థం చేసుకుని వైరాముత్తుని శిక్షించాలని చిన్మయి ముఖ్యమంత్రి స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కోరారు.
‘‘బ్రిజ్ భూషణ్‌కైనా, వైరముత్తుకు అయినా ఒకే రూల్స్ ఉండాలి. బ్రిజ్ భూషణ్ తమని వేధించాడంటూ మన దేశం గర్వించే ఛాంపియన్స్‌తోపాటు ఒక మైనర్ సైతం వ్యాఖ్యలు చేసింది. మీ పార్టీతో సత్సంబంధం ఉన్న వైరముత్తు వేధించాడంటూ గతంలో నాతోపాటు 17 మంది మహిళలు బహిరంగంగా వెల్లడించాం. దాంతో, ఆ వ్యక్తి మా కెరీర్‌ను నాశనం చేశాడు. మమ్మల్ని పరిశ్రమ నుంచి బహిష్కచించేలా చేశాడు. మాకున్న కలలతో పోలిేస్త వైరముత్తు టాలెంట్ గొప్పదేమీ కాదు. దయచేసి, వైరముత్తు లాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోండి. దాంతో తమిళనాడులోని పని ప్రదేశాలు సురక్షితంగా ఉంటాయి. సొంత ఇండస్ర్టీ నుంచే బహిష్కరణకు గురైన ఒక మహిళగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఎందుకంటే వైరముత్తుకు ఉన్న రాజకీయ అండతో అతను రెచ్చిపోతున్నాడు. రాజకీయ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని అతనికి వ్యతిరేకంగా నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.