Amala Paul: బాయ్‌ఫ్రెండ్‌ను.. పెళ్లి చేసుకున్న ‘మెగా’ బ్యూటీ
ABN , First Publish Date - 2023-11-05T19:52:42+05:30 IST
మళయాళ బ్యూటీ అమలాపాల్, జగత్ జోషి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. వారం రోజుల క్రితం ఆక్టోబర్ 26న పుట్టినరోజు సెలబ్రేషన్ సందర్భంగా జరిగిన వేడుకలో ఓ స్నేహితుడు ప్రఫోజ్ చేయగా అమలా ఓకే చెబుతూ ముద్దులతో ముంచేసింది. అది జరిగిన వారం రోజుల లోపే ఈ రోజు వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇప్పుడు వీరి పెళ్లి ఫొటోలు సొషల్మీడియాలో వైరల్‌గా మారాయి.
మాలీవుడ్ బ్యూటీ అమలాపాల్(Amala Paul) ,జగత్ జోషి(Jagat Desai) వివాహం ఆదివారం అతికొద్ది మంది సమక్షంలో ఘనంగా జరిగింది. విక్రమ్ ’నాన్న‘ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ’ఇద్దరమ్మాయిలతో‘, రామ్‌చరణ్ ’నాయక్‘ , నాగ చైతన్యతో ’బెజవాడ‘, నాని ’జెండాపై కపిరాజు‘ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఎందుకనో ఆ తర్వాత సరైన అవకాశాలు లేక తెలుగుకు దూరమైంది. ఇప్పుడు అడపాదడపా మళయాళం సినిమాలు చేస్తూ వస్తున్నది.
2014లో తమిళ దర్శకుడు ఎల్. విజయ్ను ప్రేమించి వివాహం చేసుకున్న అమలాపాల్ 2017లో విడాకులు తీసుకుని సింగిల్‌గానే ఉంటుంది. అప్పటివరకు గర్ల్ నెక్ట్స్ డోర్ వంటి చిత్రాలే చేసుకుంటూ వచ్చిన అమ్మడు ఆ తర్వాత తన స్టైల్‌ను పూర్తిగా మార్చేసి బోల్డ్ సినిమాలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ’ఆమె‘ అనే సినిమాలో నగ్నంగా కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అదే వరుసలో వెబ్ సీరిస్‌లు చేస్తూ లిప్‌లాక్‌లతోనూ రెచ్చి పోయింది.
ఖాళీ సమయాల్లో దేవాలయాలు తిరుగుతూ తన వస్త్రధారణలతో వార్తల్లో నిలుస్తూ వివాదాస్పదం అవుతూ వచ్చింది. కొన్ని హిందూ టెంపుల్స్ ఆమెను లోపలికి అనుమతివ్వకపోవడం అప్పట్లో చర్చనీయాంశం కూడా అయింది. అమ్మడు నేను వెళ్లింది గుడినా, బీచ్ అనే తేడా లేకుండా సగం సగం దుస్తులు వేసుకుంటూ నెటిజన్ల నుంచి బాగానే విమర్శలు ఎదుర్కొంది. ఇక విదేశీ పర్యటనలలోనైతే ఇంకా రెచ్చిపొతూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.
ఇదిలాఉండగా వారం రోజుల క్రితం ఆక్టోబర్26న అమాలాపాల్(Amala Paul) పుట్టినరోజు సెలబ్రేషన్ సందర్భంగా జరిగిన వేడుకలో ఓ స్నేహితుడు ప్రఫోజ్ చేయగా అమలా ఓకే చెబుతూ ముద్దులతో ముంచేసింది. అది జరిగిన వారం రోజులలోపే ఈ రోజు వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇప్పుడు వీరి పెళ్లి ఫొటోలు సొషల్మీడియాలో వైరల్‌గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి.