Actress Nithya Sasi: నగ్న చిత్రాలు తీసి ఎంత డిమాండ్‌ చేసిందంటే..

ABN , First Publish Date - 2023-07-29T14:44:39+05:30 IST

కొందరు అమ్మాయిలు అందాన్ని ఎరగా వేసి మగాళ్లను వలలో పడేస్తుంటారు. అలా దగ్గరై డబ్బు గుంజేస్తుంటారు. పోలీసులకు తల నొప్పిగా మారిన ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు సెలబ్రిటీల లెక్క కూడా అదే తీరులో ఉంది. తాజాగా కేరళలో ఓ సీరియల్‌ నటి హానీ ట్రాప్‌ (Honey trap) కేసులో అరెస్ట్‌ అయింది. పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేట్‌ చేయగ సదరు నటికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

Actress Nithya Sasi: నగ్న చిత్రాలు తీసి ఎంత డిమాండ్‌ చేసిందంటే..

కొందరు అమ్మాయిలు అందాన్ని ఎరగా వేసి మగాళ్లను వలలో పడేస్తుంటారు. అలా దగ్గరై డబ్బు గుంజేస్తుంటారు. పోలీసులకు తల నొప్పిగా మారిన ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు సెలబ్రిటీల లెక్క కూడా అదే తీరులో ఉంది. తాజాగా కేరళలో ఓ సీరియల్‌ నటి హానీ ట్రాప్‌ (Honey trap) కేసులో అరెస్ట్‌ అయింది. పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేట్‌ చేయగ సదరు నటికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. కేరళలోని పతనంతిట్టకు చెందిన సీరియల్‌ నటి నిత్య శశి (nithya sasi) ఆర్టిస్ట్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంది. డబ్బు సంపాదన కోసం తన ఫ్రెండ్‌ బినుతో కలిసి షార్ట్‌ కట్‌ రూట్‌ ఎంచుకుంది. కేరళలోని పరవూర్‌లో వృద్థుడిని హనీట్రాప్‌ చేసి రూ.11 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణతో బాధితుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో బుల్లితెర నటి, తన స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (Ex Army employee)

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బాధిత వృద్ధుడు తిరువనంతపురంలోని పట్టోమ్‌కు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి, కేరళ విశ్వవిద్యాలయంలో మాజీ ఉద్యోగి. ఈ కేసుకు సంబంధించిన సంఘటన మే 24న ప్రారంభమైంది. ఫిర్యాదుదారుడు ఒక స్థలాన్ని అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, తన స్థలాన్ని అద్దెకు తీసుకోమని నిత్య అతనికి ఫోన్‌ కాల్‌ చేసింది. ఆ పరిచయాన్ని స్నేహంగా మార్చుకొని రోజు ఆయనకు ఫోన్‌ చేస్తూ ఉండేది. ఓ రోజు ఇంటికి రావాలని ఆర్మీ ఉద్యోగిని ఆహ్వానించింది. వచ్చాక మాటల్లో పెట్టి అతని బట్టలు విప్పేసింది. స్నేహితుడు, ఆర్మీ ఉద్యోగికి బంధువు అయిన బిను సహకారంతో బాధితుడితో కలిసి నగ్న చిత్రాలు తీయించింది. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించి ఇద్దరూ రూ.25 లక్షలు డిమాండ్‌ చేశారు. పదే పదే బాధితుడికి బెదిరింపులు రావడంతో బాధిత వృదుఽ్ధడు రూ11 లక్షలు చెల్లించాడు. వారు మరింత డబ్బు డిమాండ్‌ చేయడంతో బాధితుడు పరవూరు పోలీసులకు ఈనెల 18న ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు మిగిలిన డబ్బు చెల్లిస్తానని శశి, అతని స్నేహితుడిని ఇంటికి పిలిపించాడు. అక్కడే ఉన్న పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం కేరళలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Updated Date - 2023-07-29T14:55:31+05:30 IST