Nayanathara : ఇన్‌స్టా ఎంట్రీ... తొలి పోస్ట్‌ ప్రత్యేకత ఏంటంటే...

ABN , First Publish Date - 2023-08-31T16:30:28+05:30 IST

సినిమా ప్రమోషన్స్‌కు, మీడియాకు దూరంగా ఉంటే లేడీ సూపర్‌స్టార్‌ నయనతార సోషల్‌ మీడియాలోనూ అంతగా యాక్టివ్‌గా ఉండరు. ఏదైనా విషయం అభిమానులతో పంచుకోవాలంటే తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ ఖాతా ద్వారా పంచుకుంటారు. అయితే ఇప్పుడు నయన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. ఆమె సోషల్‌ మీడియా ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఆనందిస్తున్నారు.

Nayanathara  : ఇన్‌స్టా ఎంట్రీ... తొలి పోస్ట్‌ ప్రత్యేకత ఏంటంటే...

సినిమా ప్రమోషన్స్‌కు, మీడియాకు దూరంగా ఉంటే లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (Nayanathara) సోషల్‌ మీడియాలోనూ అంతగా యాక్టివ్‌గా ఉండరు. ఏదైనా విషయం అభిమానులతో (Social media entry) పంచుకోవాలంటే తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ ఖాతా ద్వారా పంచుకుంటారు. అయితే ఇప్పుడు నయన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. ఆమె సోషల్‌ మీడియా ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. నయన్‌ తన తొలిపోస్ట్‌తోనే నెటిజన్లను ఆకర్షించారు. గురువారం ఇన్‌స్టా ఖాతా తెరచిన ఆమె తన పిల్లలను తొలిసారి అభిమానులకు చూపించారు.. ఇప్పటికే తన ఇద్దరి బిడ్డల ఫొటోలను ఎన్నో సందర్భాల్లో ప్రేక్షకులతో షేర్‌ చేసుకున్నా.. వారి ముఖాలను కవర్‌ చేసేది. ఈ సారి పిల్లల ఫేస్‌ను అభిమానులకు పరిచయం చేయడం విశేషం. ‘జైలర్‌’లోని హుకుమ్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో తన బిడ్డలు ఉయిర్‌ - ఉలగంలను ఎత్తుకుని మాస్‌ ఎంట్రీ ఇచ్చారు. ‘నేను ఇక్కడ ఉన్నా... చెప్పండి’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. (Nayanathara in Instagram)

Nayanathara.jpg

నయన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ తెరవగానే లక్షల మంది ఆమెను ఫాలో అయ్యారు. ఆమె పెట్టిన రీల్‌ను లక్షమంది లైక్‌ చేయగా ఏడు లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. నయన్‌ ప్రస్తుతం ఇన్‌స్టాలో అయిదుగురిని ఫాలో అవుతున్నారు. అందులో ఒకరు తన భర్త విఘ్నేశ్‌, రెండోది షారుక్‌ఖాన్‌, మూడో వ్యక్తి సంగీత దర్శకుడు అనిరుద్‌, ఒబామా భార్య మిషెల్లి ఒబామాతోపాటు తన సొంత ప్రొడక్షన్‌ సంస్థ ‘ది రౌడీ పిక్చర్స్‌’ ఉన్నాయి. ఆమె నటించిన తాజా చిత్రం ‘జవాన్‌’ ట్రైలర్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘నాకెంతో ఇష్టమైన షారుక్‌ ఖాన్‌తో నా తొలి హిందీ సినిమా ఇది. దీని వెనుక ఎంతో కష్టం, ప్రేమ ఉన్నాయి. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని రాసుకొచ్చారు. ఈ చిత్రం దీన్ని మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని రాశారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. అట్లీ దర్శకత్వం వహించారు.

Updated Date - 2023-08-31T16:34:28+05:30 IST