Rajani kanth: అప్పుడు రూ.110 కోట్లు అయితే... ఇది బోనస్‌!

ABN , First Publish Date - 2023-09-01T12:47:28+05:30 IST

గడిచిన ఐదేళ్లల్లో తలైవా రజనీకాంత్‌ (Rajanikanth) నటించిన చిత్రాల్లో కొన్ని ఫర్వాలేదనిపించాయి. మరికొన్ని పరాజయం చవిచూశాయి. దాంతో ఎంతో మంది విమర్శించారు. ఇక ఆయనకు సినిమాలెందుకు? అంటూ ట్రోల్‌ చేశారు. రజనీ పనైపోయింది అని కామెంట్‌ చేశారు. అయినా సినిమా చేయడంలో ఆయన ఊపు తగ్గలేదు. అవకాశాలు తగ్గలేదు. ఒక్క సినిమా హిట్‌తో ఆయన్ని విమర్శించిన ప్రతి ఒక్కరికీ గట్టి సమాధానం ఇచ్చారు.

Rajani kanth: అప్పుడు రూ.110 కోట్లు అయితే... ఇది బోనస్‌!

గడిచిన ఐదేళ్లల్లో తలైవా రజనీకాంత్‌ (Rajanikanth) నటించిన చిత్రాల్లో కొన్ని ఫర్వాలేదనిపించాయి. మరికొన్ని పరాజయం చవిచూశాయి. దాంతో ఎంతో మంది విమర్శించారు. ఇక ఆయనకు సినిమాలెందుకు? అంటూ ట్రోల్‌ చేశారు. రజనీ పనైపోయింది అని కామెంట్‌ చేశారు. అయినా సినిమా చేయడంలో ఆయన ఊపు తగ్గలేదు. అవకాశాలు తగ్గలేదు. ఒక్క సినిమా హిట్‌తో ఆయన్ని విమర్శించిన ప్రతి ఒక్కరికీ గట్టి సమాధానం ఇచ్చారు. కలెక్షన్లతో చెంప చెళ్లుమనిపించారు. తాజాగా ఆయన నటించిన ‘జైలర్‌’ (jailer) చిత్రం ఆగస్ట్‌ 10న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో కళానిధి మారన్‌ నిర్మించారు తమన్నా, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌ ఈ సినిమాకు ప్లస్‌ అయ్యారు. ఆగస్ట్‌ 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విశేష స్పందన రాబట్టుకుంది. దాదాపు రూ.650 కోట్లు వసూళ్లు రాబట్టిందని ట్రేడ్‌ పండితులు చెబుతన్నారు. గత ఏడాది తమిళంలో విడుదలైన ‘పొన్నియన్‌ సెల్వన్‌’, ‘విక్రమ్‌’ చిత్రాల వసూళ్లను ‘జైలర్‌’ బీచ్‌ చేసింది.

123.jpg

ఈ సినిమా సక్సెస్‌తో ఆనందంలో ఉన్న నిర్మాత కళానిధి మారన్‌ గురువారం రజనీకాంత్‌ను కలుసుకుని తన సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌కి ఓ చెక్‌ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని సన్‌ పిక్చర్స్‌ తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చెక్కును కవర్‌పై ‘ది రియల్‌ రికార్డ్‌ మేకర్‌’ అని రాసి ఉంది. ఈ సినిమా కోసం రజనీకి రూ 110 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు కోలీవుడ్‌ మీడిమా కథనాలు రాసింది. తాజాగా కళానిధి మారన్‌ ఇచ్చిన చెక్‌ లాభాల నుంచి గిఫ్ట్‌ అని కోలీవుడ్‌ పరిశ్రమ గుసగుసలాడుతోంది.

Updated Date - 2023-09-01T16:31:58+05:30 IST