Rana Daggubati: ఆ హీరోయిన్‌ని చూస్తే కోపం ఆగలేదు..!

ABN , First Publish Date - 2023-08-15T15:33:24+05:30 IST

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోట’ ప్రీ రిలీజ్‌ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన రానా దగ్గుబాటి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దుల్కర్‌తో తనకున్న స్నేహం, అనుభవాన్ని తెలిపారు రానా. ‘

Rana Daggubati: ఆ హీరోయిన్‌ని చూస్తే కోపం ఆగలేదు..!

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోట’ (King of kotha) ప్రీ రిలీజ్‌ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన రానా దగ్గుబాటి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దుల్కర్‌తో తనకున్న స్నేహం, అనుభవాన్ని తెలిపారు రానా(Rana daggubati). ‘‘దుల్కర్‌ సల్మాన్‌ కోపం చాలా తక్కువ. మేమిద్దరం యాక్టింగ్‌ స్కూల్లో స్నేహితులం. తను నా జూనియర్‌. చాలా మంచి మనిషి. అప్పట్లో తను ఒక హిందీ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా నిర్మాతలు కూడా నా ేస్నహితులే. నా ఇంటి దగ్గర్లోనే మూవీ షూటింగ్‌ జరుగుతుంది. దుల్కర్‌ను కలవడం కోసం లొకేషన్‌కు వెళ్లాను. తను లొకేషన్‌లో ఒక స్పాట్‌ బాయ్‌తో కూర్చొని ఉండగా.. ఒక పెద్ద హిందీ హీరోయిన్‌ ఫోన్‌లో బిజీగా ఉంది. ఆ హీరోయిన్‌ టైమ్‌ వేస్ట్‌ చేయడం చూసి నా కోపం ఆగలేదు. కానీ దుల్కర్‌ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ హీరోయిన్‌ ప్రవర్తనకు నేను నిర్మాతలను తిట్టాను. తనకంటూ డిఫరెంట్‌ మార్క్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. దుల్కర్‌ యాక్షన్‌ సినిమా చేేస్త చూడాలని ఎప్పటి ననుంచో ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు.

‘కింగ్‌ ఆఫ్‌ కోట’ ఒక అద్భుతమైన ప్రయాణం. అందులోని పాత్రలు, కథ, ప్రొడక్షన్‌.. ఇలా అన్ని అంశాలు సినిమాను వేరే లెవెల్‌లో నిలబెట్టాయి. నేను మొదటిసారి ఈ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలపడం మరింత ఉత్సాహంగా అనిపించింది. వేఫారర్‌ ఫిల్మ్స్‌కు, జీ స్టూడియోస్‌కు, నాకు.. ఇది ఒక ప్రత్యేకమైన జర్నీగా గుర్తుండిపోతుంది. ఓనమ్‌ పండుగకు నా ప్రేక్షకులకు ఇది ఒక ప్రత్యేకమైన ట్రీట్‌. అభిలాష్‌ జోషీకి ఇది మొదటి చిత్రమే అయినా.. తనను నమ్మి నిర్మాతలు ఈ సినిమాపై భారీగా ఖర్చుపెట్టారు’’ అంటూ దుల్కర్‌ చెప్పుకొచ్చాడు.

ఈ కార్యక్రమానికి మరో అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ ‘‘నాకు తెలిసిన అసలైన పాన్‌ ఇండియా హీరో దుల్కర్‌ మాత్రమే. ‘కింగ్‌ ఆఫ్‌ కోట’ తప్పకుండా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించనుంది. ఈ నెల 24న ‘కింగ్‌ ఆఫ్‌ కోట’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-08-15T18:47:47+05:30 IST