Surya Son of Krishnan: రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN , First Publish Date - 2023-07-15T19:24:19+05:30 IST

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య(Suriya) హీరోగా నటించిన హిట్‌ చిత్రాల్లో విభిన్నమైన చిత్రం ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’(Surya Son of Krishnan). క్లాసిక్‌ హిట్‌ గా నిలిచిన ఈ చిత్రానికి గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకుడు. తమిళం ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీఆర్‌ మీడియా పతాకంపై శోభారాణి గ్రాండ్‌గా విడుదల చేశారు.

Surya Son of Krishnan: రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య(Suriya) హీరోగా నటించిన హిట్‌ చిత్రాల్లో విభిన్నమైన చిత్రం ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’(Surya Son of Krishnan). క్లాసిక్‌ హిట్‌ గా నిలిచిన ఈ చిత్రానికి గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకుడు. తమిళం ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీఆర్‌ మీడియా పతాకంపై శోభారాణి గ్రాండ్‌గా విడుదల చేశారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్ర ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రానికి తెలుగులోనూ ఫ్యాన్స్‌ ఎక్కువే. హారీస్‌ జైరాజ్‌ మ్యూజిక్‌ ఒక బ్లాక్‌బస్టర్‌.

ఇలాంటి క్లాసిక్‌ సినిమా మళ్లీ రిలీజ్‌ కావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీ రిలీజ్‌ చేయబోతున్నారు మేకర్స్‌. సూర్య పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21న రిలీజ్‌ చేస్తునట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇందులో సమీరారెడ్డి, సిమ్రాన్‌ నాయికలుగా కాగా, దివ్య స్పందన కీలక పాత్రలో నటించారు. హరీష్‌ జై రాజ్‌ సంగీతం అందించగా, రత్నవేలు ఛాయగ్రాహకుడిగా పనిచేశారు.

Updated Date - 2023-07-15T19:24:19+05:30 IST