Nayanthara: పదేళ్ల తర్వాత రిపీట్ కానున్న హిట్ కాంబో

ABN , First Publish Date - 2023-04-06T16:51:20+05:30 IST

కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్‌తో అలరించి తర్వాత ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార (Nayanthara). ‘రాజారాణి’ (Raja Rani), ‘అనామిక’, ‘మయూరి’, ‘కొలమావు కోకిల’, ‘కనెక్ట్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

Nayanthara: పదేళ్ల తర్వాత రిపీట్ కానున్న హిట్ కాంబో

కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్‌తో అలరించి తర్వాత ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార (Nayanthara). ‘రాజారాణి’ (Raja Rani), ‘అనామిక’, ‘మయూరి’, ‘కొలమావు కోకిల’, ‘కనెక్ట్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. నయన్ త్వరలోనే 75వ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా లేడీ సూపర్ స్టార్ 75 అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో జై (Jai) హీరోగా నటించనున్నారు. గతంలో ఈ జంట ‘రాజారాణి’ లో నటించారు. 2013లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. లో బడ్జెట్‌గా రూపొందిన ఈ సినిమా మేకర్స్‌కు భారీ లాభాలను పంచిపెట్టింది.

నయన్ 75వ ప్రాజెక్టులో జై నటించనున్నాడని చిత్ర బృందం ప్రకటించింది. జై పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ సినిమాను 2022 జులైలోనే లాంచ్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల మూవీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఈ సినిమాలో జై, సత్యరాజ్, రెడిన్ కింగ్ స్లే తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్, నాద్ స్టూడియోస్ కలసి నిర్మించనున్నాయి. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ పేరును మాత్రం ప్రకటించలేదు.

jai.jpg

నయనతార నటించిన ‘నేను రౌడీనే’ సినిమాకు విఘ్నేశ్ శివన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. ఆలోచనలు, అభిరుచులు కలవడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఈ జంట గతేడాది పెళ్లి చేసుకున్నారు. నయన్, విఘ్నేశ్ శివన్ సరోగసీ విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఆ పిల్లలకు ఉయిర్ (Uyir), ఉలగ్ (Ulag) అనే పేరు పెట్టారు. తాజాగా వారి పూర్తి పేర్లను నయనతార స్వయంగా వెల్లడించారు.‘నా మొదటి కుమారుడు పేరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir Rudronil N Shivan), నా రెండో కుమారుడి పేరు ఉలగ్ ధైవేగ్ ఎన్ శివన్ (Ulag Dhaivag N Shivan)’ అని చెప్పుకొచ్చారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-06T16:53:52+05:30 IST