Ajith Kumar: 18నెలలు.. 62దేశాలు.. టైటిల్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-06T19:02:48+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు. ఆయనకు అభిమానుల్లో విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అజిత్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా చూస్తుంటారు.

Ajith Kumar: 18నెలలు.. 62దేశాలు.. టైటిల్ ఏంటంటే..

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు. ఆయనకు అభిమానుల్లో విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అజిత్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా చూస్తుంటారు. అజిత్ చివరగా ‘తుణివు’ (Thunivu) లో నటించారు. ఈ చిత్రం తెలుగులోకి ‘తెగింపు’ (Tegimpu) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. అజిత్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఆయన రెండో విడత వరల్డ్ బైక్ టూర్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

వరల్డ్ బైక్ టూర్‌కు ‘రైడ్ ఫర్ మ్యూచువల్ రెస్పెక్ట్’ (Ride For Mutual Respect) అని టైటిల్ పెట్టారు. కొండలు, పర్వతాలు, గతుకుల రోడ్లతో కూడిన సవాళ్ల మధ్య ఈ యాత్ర చేపట్టనున్నారు. 62 దేశాల్లో, 18నెలల పాటు ఈ టూర్ కొనసాగనుంది. అజిత్ ఇప్పటికే ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్‌లాండ్, రష్యా వంటి దేశాల గుండా మొదటి విడత బైక్ యాత్రను పూర్తి చేశారు.

లైకా ప్రొడక్షన్స్‌కు అజిత్ ఓ సినిమా చేయాలి. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఏకే 62’ (AK 62)అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మొదటగా విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ను దర్శకుడిగా అనుకున్నారు. కానీ, సృజానాత్మక విభేదాలతో విఘ్నేశ్ మూవీ డైరెక్షన్ నుంచి తప్పుకొన్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం మగిజ్ తిరుమనేని డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు మారడంతో చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌‌కు మరింత సమయం తీసుకుంటుంది. అందువల్ల చిత్రాన్ని పూర్తి చేసి వరల్డ్ టూర్ చేయనున్నట్టు అజిత్ పేర్కొన్నారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్రను చేయనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-06T19:02:49+05:30 IST