Dream Girl: నటి బబిత కుమార్తె హీరోయిన్‌గా ‘డ్రీమ్‌ గర్ల్‌’.. డ్రీమే విలన్ అయితే..

ABN , First Publish Date - 2023-11-18T16:21:24+05:30 IST

స్టంట్‌ మాస్టర్‌ జస్టిన్‌ మనవరాలు, నటి బబిత కుమార్తె హరిష్మిత హీరోయిన్‌గా, జీవా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డ్రీమ్‌ గర్ల్‌’. చారులత ఫిలిమ్స్‌ బ్యానరుపై ఎం.ఆర్‌.భారతి కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ప్రేమికుల దినోత్సవం రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా డైరెక్టర్ తెలిపారు.

Dream Girl: నటి బబిత కుమార్తె హీరోయిన్‌గా ‘డ్రీమ్‌ గర్ల్‌’.. డ్రీమే విలన్ అయితే..
Dream Girl Movie Still

స్టంట్‌ మాస్టర్‌ జస్టిన్‌ మనవరాలు, నటి బబిత కుమార్తె హరిష్మిత (Harishmitha) హీరోయిన్‌గా, జీవా (Jeeva) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డ్రీమ్‌ గర్ల్‌’ (Dream Girl). చారులత ఫిలిమ్స్‌ బ్యానరుపై ఎం.ఆర్‌. భారతి (Director MR Bharathi) కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. ప్రభు శాస్తా, ధృవన్‌, ఇందిరా తదితరులు ఇతర పాత్రలను పోషించారు. సాల్మన్‌ బోస్‌ ఛాయాగ్రహణం అందించగా, ఇలమారన్‌ సంగీతం సమకూర్చారు. ఎన్‌.కావేరి మాణిక్యం, డాక్టర్‌ ఆర్‌.గుణశేఖరన్‌, బి.ఆదిత్యన్‌ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్ర వివరాలను డైరెక్టర్ ఎం.ఆర్‌. భారతి విలేకరులకు తెలియజేశారు.

Harishmitha.jpg

‘‘ఇదొక ప్రేమకథ. హీరో సినిమాలో దర్శకుడు కావాలని, హీరోయిన్‌ సింగర్‌ కావాలన్న లక్ష్యం కోసం కృషి చేస్తుంటారు. అదేసమయంలో హీరోహీరోయిన్లు తమ లైఫ్‌ను జాలీగా గడిపేస్తుంటారు. ఇది ఫుల్‌లెంగ్త్‌ లవ్‌స్టోరీ. ప్రతి నాయకుడు లేరు. హీరోహీరోయిన్ల కలే వారి ప్రధాన శత్రువు. కథ ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో చిత్ర షూటింగ్‌‌ని అంతే ఆహ్లాదకరమైన ఊటీలో చిత్రీకరించాం. కేవలం 20 రోజుల్లోనే.. చాలా చిన్న బడ్జెట్‌తో పూర్తి చేశాం. ఇప్పుడు వచ్చే అనేక చిన్న చిత్రాలు 60 లేదా 70 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. కోటి, రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రమోషన్‌ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీనికి కారణం సరైన ప్లానింగ్‌ లేకపోవడమే కారణం. (Director MR Bharathi about Dream Girl)


Dream-Girl-2.jpg

నేటి టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని వాళ్లే ఇలా చేస్తారు. పక్కా ప్రణాళికతో ముందుకెళితే కేవలం రూ.25 లక్షల్లో ఒక చిత్రాన్ని తెరకెక్కించవచ్చు. ఒక నిర్మాతకు రూ.కోటి నష్టం వస్తే ఎలా తట్టుకోగలరు. మా ‘డ్రీమ్‌ గర్ల్‌’ చాలా తక్కువ బడ్జెట్‌తోనే రూపుదిద్దుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఇందులో ఉంది. వచ్చే యేడాది ప్రేమికుల దినోత్సవం రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని డైరెక్టర్ ఎం.ఆర్‌. భారతి తెలిపారు.


ఇవి కూడా చదవండి:

========================

*Siren Teaser: మంచోడు.. మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా?

********************************

*Unstoppable with NBK: ‘వైల్డెస్ట్ ఎపిసోడ్ ప్రోమో’.. బాలయ్యను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ హీరో..!

********************************

*Varalaxmi Sarathkumar: ‘కోట బొమ్మాళి పీఎస్‌’ ఎలా ఉంటుందంటే..?

************************************

Updated Date - 2023-11-18T16:21:25+05:30 IST