Perarasu: అలా చేయడం వల్ల కోలీవుడ్ సినీ కార్మికులు నష్టపోతున్నారు

ABN , First Publish Date - 2023-09-22T16:28:54+05:30 IST

తమిళ చిత్రపరిశ్రమకు చెందిన బడా హీరోల చిత్రాల షూటింగులకు ఇతర రాష్ట్రాల్లో భారీ సెట్స్‌ వేసి చిత్రీకరణ జరుపుతున్నారని, తద్వారా ఆయా రాష్ట్రాలకు చెందిన సినీ నిర్మాణ కార్మికులు లబ్ధి పొందుతున్నారని, ఇది మంచిది కాదని దర్శకుడు పేరరసు అన్నారు. తాజాగా ఆయన ‘ఐమా’ మూవీ ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ కామెంట్స్ చేశారు.

Perarasu: అలా చేయడం వల్ల కోలీవుడ్ సినీ కార్మికులు నష్టపోతున్నారు
Kollywood Director Perarasu

తమిళ చిత్రపరిశ్రమకు చెందిన బడా హీరోల చిత్రాల షూటింగులకు ఇతర రాష్ట్రాల్లో భారీ సెట్స్‌ వేసి చిత్రీకరణ జరుపుతున్నారని, తద్వారా ఆయా రాష్ట్రాలకు చెందిన సినీ నిర్మాణ కార్మికులు లబ్ధి పొందుతున్నారని, ఇది మంచిది కాదని దర్శకుడు పేరరసు (Director Perarasu) అన్నారు. పెద్ద హీరో చిత్రాల నిర్మాణంలో తమిళ సినీ నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. తమిళ్‌ ఎగ్జాటిక్‌ ఫిల్మ్స్‌ బ్యానరుపై నిర్మాత షణ్ముగ రామస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఐమా’ (Aima). సర్వైలెన్స్‌ థ్రిల్లర్‌‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో యూనిస్‌, ఎల్విన్‌ జూలియట్‌, అఖిల్‌ ప్రభాకరన్‌, షాజీ, షీరా, మేఘాబాలు మనోహరన్‌ తదితరులు నటించారు. ఈ చిత్రం ద్వారా రాహుల్‌ ఆర్‌ కృష్ణన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విష్ణు కణ్ణన్‌ ఛాయాగ్రహణం సమకూర్చగా, కేఆర్‌ రాహుల్‌ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో తాజాగా చెన్నైలో జరిగింది. ఇందులో సీనియర్‌ నిర్మాత కె.రాజన్‌, దర్శకులు పేరరసు, కేబుల్‌ శంకర్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. (Aima Audio Launch)

ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు (Perarasu) మాట్లాడుతూ... కోలీవుడ్‌కు చెందిన పెద్ద హీరోలు నటించే చిత్రాల్లో తమిళ సినీ నిర్మాణ కార్మికులకు అవకాశం కల్పించాలి. ఇందుకోసం గతంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి (RK Selvamani) తనవంతు ప్రయత్నం చేయగా, దాన్ని మరో కోణంలో తీసుకెళ్లి వివాదం సృష్టించారు. సినిమా అంటేనే ఫిక్షన్‌. కల్పితాన్ని వెండితెరపై నిజమని నమ్మించడమే సినిమా. ఇందుకోసం నటీనటులు డూప్‌ల సాయంతో నటించాలని అన్నారు.


Aima.jpg

నిర్మాత కె. రాజన్‌ (K Rajan) మాట్లాడుతూ.. తమిళ చిత్రపరిశ్రమలో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని చిత్రాల కారణంగా రూ.వెయ్యి కోట్ల మేరకు నిధులు స్తంభించిపోయాయని తెలిపారు. చిత్ర నిర్మాత షణ్ముగ రామస్వామి (Shanmukha Ramaswamy) మాట్లాడుతూ... ఐటీ రంగానికి చెందిన నేను సినిమాపై వ్యామోహంతో వచ్చాను. నటనపై కూడా అమితమైన పిచ్చి. నటుడిగా అవకాశం ఇవ్వాలని ఎవరివద్దా అడగలేను. అందుకే సొంతంగా ఒక చిత్రాన్ని నిర్మించి, అందులో నటించాను. అలా నా కోరికను తీర్చుకున్నానని వివరించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Tiger Nageswara Rao: అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు.. ‘వీడు’

********************************

*Vijay Antony: ‘నా కూతురి చావుతోనే, నేనూ చనిపోయా’.. కన్నీళ్లు పెట్టిస్తోన్న విజయ్ ఆంటోని లేఖ

*******************************

*Cable Reddy: ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ చూశారా..

*******************************

*Naveen Polishetty: సీన్ పేపర్‌లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు

******************************

*Natti Kumar: అసెంబ్లీలో బాలకృష్ణపై అంబటి వ్యాఖ్యలను ఖండిస్తున్నా..

********************************

Updated Date - 2023-09-22T16:28:54+05:30 IST