Hansika: మ్యారేజ్ తర్వాత మరింత బిజీగా.. హన్సిక స్పందనిదే!
ABN , First Publish Date - 2023-11-11T22:06:22+05:30 IST
సాధారణంగా వివాహం తర్వాత హీరోయిన్లకు సినీ అవకాశాలు క్రమంగా తగ్గిపోతుంటాయి. కానీ, హన్సిక మోత్వానీ, కాజల్ అగర్వాల్ వంటి వారికి మాత్రం వరుసగా సినీ అవకాశాలు వరిస్తున్నాయి. హన్సిక పెళ్లి తర్వాత పలు చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ఆమె నటించిన నాలుగు చిత్రాలు వచ్చే యేడాది విడుదలకానున్నాయి.
సాధారణంగా వివాహం తర్వాత హీరోయిన్లకు సినీ అవకాశాలు క్రమంగా తగ్గిపోతుంటాయి. కానీ, హన్సిక మోత్వానీ (Hansika Motwani), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వంటి వారికి మాత్రం వరుసగా సినీ అవకాశాలు వరిస్తున్నాయి. హన్సిక పెళ్లి తర్వాత పలు చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ఆమె నటించిన నాలుగు చిత్రాలు వచ్చే యేడాది విడుదలకానున్నాయి. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో ఆమె బిజీగా ఉన్నారు. ఆమె నటించిన తమిళ చిత్రం ‘గార్డియన్’ (Guardian), తెలుగు సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి’ (My Name is Shruti) వంటివి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, మరో తమిళ చిత్రం ‘మ్యాన్’, తెలుగులో ‘105 నిమిషాలు’ వంటి సినిమాలలో కూడా ఆమె నటిస్తున్నారు. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్లలో కూడా ఆమె నటిస్తున్నారు. ఇవన్నీ వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే, మరికొన్ని కొత్త చిత్రాలను చేసేందుకు ఆమె కమిట్ అవుతున్నారు.
పెళ్లి తర్వాత.. ఇలా వరుస అవకాశాలపై హన్సిక స్పందిస్తూ.. (Hansika about Movie Chances) ‘‘నా అభిమానులు (Fans) నుంచి పొందుతున్న ప్రేమాభిమానాలకు నిజంగానే శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ‘గార్డియన్’, ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రాలు నా కెరీర్లో ఎంతో ముఖ్యమైనవి. కచ్చితంగా 2024 హన్సిక యేడాదిగా ఉంటుంది. ఇదంతా అభిమానులు, ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది. వారందరూ చూపించే ప్రేమే నాకు ఎనర్జీనిస్తోంది. ఇంకా మంచి పాత్రలు చేసి వారిని అలరించాలని అనుకుంటున్నాను..’’ అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
========================
*Chandramohan: అడుగు ఎత్తు ఎక్కువుంటేనా.. ఏఎన్నార్ మాటలకు చంద్రమోహన్ ఏమనేవారంటే..
*********************************
*Shantala: ‘శాంతల’ను కొనియాడిన భారత మాజీ ఉపరాష్ట్రపతి
*******************************
*Producer: టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
******************************
*Game Changer: అనుకున్నదే అయ్యింది.. ‘జరగండి’ దీపావళికి రావడం లేదు
******************************