Chandramohan: చంద్రమోహన్‌కు కోలీవుడ్ నివాళి
ABN , First Publish Date - 2023-11-13T01:50:04+05:30 IST
సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) మృతితో చెన్నై నగరంతో పాటు కోలీవుడ్ కూడా విషాదంలో మునిగింది. ఆరు దశాబ్దాల పాటు నగరంతో ఆయనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంది. 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో రంగప్రవేశం చేసిన చంద్రమోహన్.. అంతకు ముందు నుంచే చెన్నై నగరంలో స్థిరపడ్డారు. అయితే తెలిసినవారంతా హైదరాబాద్‌లోనే ఉండడం, అక్కడి నుంచి రాకపోకలు సాగించడం కష్టం కావడంతో రెండేళ్ల క్రితం అక్కడకు మకాం మార్చారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) మృతితో చెన్నై నగరంతో పాటు కోలీవుడ్ కూడా విషాదంలో మునిగింది. ఆరు దశాబ్దాల పాటు నగరంతో ఆయనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంది. 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో రంగప్రవేశం చేసిన చంద్రమోహన్ (Chandramohan).. అంతకు ముందు నుంచే చెన్నై (Chennai) నగరంలో స్థిరపడ్డారు. ఆయనకు ఎనిమిదిమంది సోదరీమణులు, ఒక సోదరుడు. 1970 మార్చి 15న ప్రముఖ రచయిత్రి జలంధరను వివాహం చేసుకున్నారు. స్థానిక కోడంబాక్కంలో స్థిరపడిన చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఇక్కడే వుండగా, చిన్నకుమార్తె విదేశాల్లో స్థిరపడ్డారు. 1980 దశకంలో చిత్ర పరిశ్రమ అంతా హైదరాబాద్ వెళ్లిపోయినా చంద్రమోహన్ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. హైదరాబాద్‌లో జరిగే షూటింగ్‌లకు ఇక్కడి నుంచే వెళ్లేవారు.
అయితే తెలిసినవారంతా హైదరాబాద్ (Hyderabad)లోనే ఉండడం, అక్కడి నుంచి రాకపోకలు సాగించడం కష్టం కావడంతో రెండేళ్ల క్రితం అక్కడకు మకాం మార్చారు. అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, షూటింగుల్లో పాల్గొనేవారు.
చంద్రమోహన్ పలు తమిళ చిత్రాల్లోనూ నటించారు. నట దిగ్గజాలు దివంగత ఎంజీ రామచంద్రన్, నడిగర్ తిలగం శివాజీ గణేశన్ చిత్రాల్లో నటించి, తమిళ సినీ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. 1975లో ఎంజీఆర్ నటించి విడుదలైన ‘నాలై నమదే’ అనే చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఎంజీఆర్ తమ్ముడి పాత్రలో చంద్రమోహన్ కనిపించారు. అదేవిధంగా శివాజీ గణేశన్ నటించిన ‘అండమాన్ కాదలి’ చిత్రంలో ఆయన కుమారుడి పాత్రలో అద్భుతంగా నటించారు. చంద్రమోహన్ మృతి పట్ల కోలీవుడ్‌కు చెందిన పలువురు తీవ్ర సంతాపం ప్రకటించారు. కాగా, చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
========================
*Ajagratha: ‘అజాగ్రత’లో కర్ణాటక మాజీ సీఎం భార్య..
*****************************
*Lal Salaam Teaser: మరో ‘జైలర్’ని తలపించిన మొయిద్దీన్ భాయ్
*****************************
*Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి
****************************