Vignesh Shivan: ‘ఎల్‌ఐసీ’ లో ప్రదీప్ రంగనాథన్.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం కాదండోయ్..

ABN , First Publish Date - 2023-03-09T17:33:43+05:30 IST

‘లవ్ టుడే’ (Love Today) తో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. లో బడ్జెట్‌లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Vignesh Shivan: ‘ఎల్‌ఐసీ’ లో ప్రదీప్ రంగనాథన్.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం కాదండోయ్..

‘లవ్ టుడే’ (Love Today) తో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. లో బడ్జెట్‌లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీస్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ప్రదీప్ నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఫలితంగా ప్రదీప్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇతర దర్శకులు కూడా తమ చిత్రాల్లో నటించాలని ఆయనను అడుగుతున్నారు. ఈ మధ్యనే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) కుడా ఆయనను సంప్రదించారు. ఓ చిత్రం చేయాలని అడిగారు. అందుకు ప్రదీప్ కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం అందుతుంది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ (Ajith) తో విఘ్నేశ్ శివన్ ఓ సినిమా చేయాలి. సృజనాత్మక విభేదాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి విఘ్నేశ్ శివన్ తప్పుకున్నారు. అనంతరం ఆయన కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ప్రదీప్ రంగనాథన్‌ను సంప్రదించి సినిమా చేయాలని అడిగారు. కథ కుడా వినిపించారు. ప్రాజెక్టు మెటీరియలైజ్ అయింది. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి మేకర్స్ ‘ఎల్‌ఐసీ’ (Love Insurance Corporation) అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. కొన్నాళ్ల క్రితమే విఘ్నేశ్ ఈ సినిమాను శివ కార్తికేయన్‌తో చేయాలి. ఏమైందో తెలియదు కానీ ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కలేదు.

విఘ్నేశ్ శివన్ చివరగా ‘కాతు వక్కుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kadhal) కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంత, నయనతార తదితరులు కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-09T17:33:45+05:30 IST