Mansoor Ali Khan: ఎడతెగని త్రిష, మన్సూర్ పంచాయితీ.. చిరంజీవి, త్రిషలపై కేసు
ABN , First Publish Date - 2023-11-26T15:59:38+05:30 IST
మన్సూర్, త్రిషల పంచాయితీ వివాదం ఓ కొలిక్కి వచ్చేసినట్టే అని అంతా అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ గొడవ మరో కొత్త రూపం సంతరించుకుని నిత్య రావణ కాష్టం తరహాలో తయారైంది. ఇప్పుడు ఇందులో కొత్తగా మరో ఇద్దరి పేరు వచ్చి చేరడంతో మున్ముందు ఈ ఇష్యూ ఇంకా ఎన్ని రూపాంతరాలు చెందుతుందనేది అంతుబట్టకుండా ఉంది.
మన్సూర్, త్రిషల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. నిను వీడని నీడను నేను అన్నట్లుగా మన్సూర్ అలీఖాన్ తాజా స్టేట్‌మెంట్‌తో అర్ధమవుతున్నది. వీళ్లిదరి మధ్య అంతా అయిపోయింది ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేసినట్టే అని అంతా అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ గొడవ మరో కొత్త రూపం సంతరించుకుని నిత్య రావణ కాష్టం తరహాలో తయారైంది. ఇప్పుడు ఇందులో కొత్తగా మరో ఇద్దరి పేరు వచ్చి చేరడంతో మున్ముందు ఈ ఇష్యూ ఇంకా ఎన్ని రూపాంతరాలు చెంది ఎవరినీ ఇందులోకి లాగుతుందనేది అంతుబట్టకుండా ఉంది.
వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం ఓ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటివరకు సినిమాలలో చాలా రేపు సీన్లు చేశా కానీ త్రిషతో బెడ్ రూమ్ సీన్లలో నటించలేదు లియోలో అ ఆవకాశం వస్తుందని అనుకున్నా కానీ అది జరుగలేదని మన్సూర్ చెప్పినట్లు ఓ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియో త్రిష దృష్టికి రావడం ఆమె సీరియస్‌గా రియాక్ట్ యి పోస్టు పెట్టడంతో ఆది కాస్తా ట్రెండింగ్‌లోకి వచ్చి తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి హీరోలు, హీరోయిన్లు స్పందించడం వంటి పనులు చకచకా జరిగిపోయాయి.
టాలీవుడ్ నుంచి మొదట చిరంజీవి ఈ వీడియోను ఖండిస్తూ త్రిషకు నా మద్దతు ఉంటుందని చెప్పడం, ఆయనను అనుసరిస్తూ మరికొంతమంది మద్దతు తెలపడంతో ఈ ఇష్యూ చాలా పెద్దదయింది. తమిళ నడిగర్ సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 గంటల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే బ్యాన్ చేస్తాం అంటూ మన్సూర్‌కి నోటీసులు ఇవ్వగా దానికి ఆయన మాట్లాడుతూ నేను దిగొచ్చేది లేదంటూ నేను ఎలాంటి తప్పు చేయలేదంటూ తిరిగి ఆ సంఘానికే డెడ్‌లైన్ పెట్టాడు.
ఇదే క్రమంలో జాతీయ మహిళా సంఘం, చెన్నై హైకోర్టు రంగంలోకి దిగి కేసులు ఫైల్ చేయడం , నోటీసులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు జరగడంతో మన్సూర్ అలీఖాన్ దిగొచ్చి త్రిషకు క్షమాపణలు చెప్పాడు, ఆమె పెళ్లికి నేనే స్వయంగా వెళ్లి మంగళ సూత్రం ఇస్తా అంటూ ప్రెస్మీట్ పెట్టి మరి చెప్పడంతో ఇక ఈ వివాదం ముగిసినట్టేనని అంతా అనుకున్నారు.
కానీ ఆయన అలా చెప్పి రోజు గడవక ముందే సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరుసటి రోజు మన్సూర్ మాట్లాడుతూ మరో సంచలన నిర్ణయానికి వచ్చాడు. నగరంలో పదిరోజులు అశాంతి, అల్లర్లు, పరువు నష్టం, క్రిమినల్, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అంశాలపై నా లాయర్ ధనుంజయన్ ద్వారా కోర్టులో కేసు వేస్తానని, త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలకు నోటీసులు పంపిస్తున్నానంటూ బాంబు పేల్చాడు.
అంతేకాకుండా నేను అసలు మాట్లాడిన ఒరిజినల్ వీడియోలను కోర్టుతో పాటు వారికి కూడా పంపిస్తానన్నాడు. నేను ప్రెస్మీట్‌లో మాట్లాడిన వీడియోను ఆ తర్వాత మట్లాడిన వీడియోలను ఎడిట్ చేసి నేను త్రిషపై అసభ్యకరంగా మట్టాడినట్టు సృష్టించారని, అది తెలీకుండా నాపై నిందలు వేశారన్నారు. ఈ వీడియోతో పాటు మరి కొన్ని ఆధారాలతో వారిని కోర్టుకు లాగుతానని స్పష్టం చేశారు. దీంతో ఈ ఇష్యూ ఇంకా ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో అని, ఎటు వైపు వెళుతుందో అని రెండు సినీ ఇండస్ట్రీలు, అభిమానులు అందోళన చెందుతున్నారు.