ప్రజలు ధైర్యంగా ఉండాలి: మారి సెల్వరాజ్
ABN , Publish Date - Dec 22 , 2023 | 08:29 PM
ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ క్షేత్రస్థాయిలో వరద సహాయక చర్యల్లో పాల్గొని అనేక మందిని రక్షించారు. తన బృందంతో కలిసి ఆయన అనేక మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారికి ఆవాసం కల్పించడంతోపాటు అన్నపానీయాలను కూడా సమకూర్చారు. వరద నీరు పూర్తిగా తొలగిపోయేంత వరకు ప్రజలు ధైర్యంగా ఉండాలని తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) క్షేత్రస్థాయిలో వరద సహాయక చర్యల్లో పాల్గొని అనేక మందిని రక్షించారు. తన బృందంతో కలిసి ఆయన అనేక మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారికి ఆవాసం కల్పించడంతోపాటు అన్నపానీయాలను కూడా సమకూర్చారు. ‘పరియేరుం పెరుమాళ్’, ‘కర్ణన్’, ‘మామన్నన్’ వంటి చిత్రాలను తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించిన మారి సెల్వరాజ్... ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న తూత్తుక్కుడి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలను తన బృందంతో కలిసి ఆయన కాపాడారు. ఈ విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘పుల్లింకుళంలో వరద నీటిలో చిక్కుకున్న నా తల్లిదండ్రులతో సహా ఇతరులను రక్షించాం. వరద నీరు చుట్టేయడంతో అనేక గ్రామాల ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాం. గ్రామాల చుట్టూ వరద నీరు ఉండటంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పలు ప్రాంతాల్లోకి పడవల ద్వారా వెళ్ళేందుకు కూడా చాలా కష్టంగా ఉన్నది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వరద నీరు పూర్తిగా తొలగిపోయేంత వరకు ప్రజలు ధైర్యంగా ఉండాలి’ అని మారి సెల్వరాజ్ కోరారు. (Mari Selvaraj Tweet)
ఇవి కూడా చదవండి:
====================
*Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్.. షరతులు ఏంటంటే?
********************************
*Sravanthi: జెమిని టీవీలో సరికొత్త సీరియల్.. ఎప్పటి నుంచంటే?
*******************************
*పవన్ 1, ప్రభాస్ 2.. ప్రభాసే ‘టాప్’, మిగతా స్టార్ హీరోలంతా ‘జీరో’!
*********************************