Nadigar Sangam: మన్సూర్‌ అలీఖాన్‌ను ఎందుకు బహిష్కరించకూడదు?

ABN , First Publish Date - 2023-11-22T14:25:39+05:30 IST

హీరోయిన్‌ త్రిషను ఉద్దేశించి కోలీవుడ్‌ విలన్‌, విలక్షణ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో మన్సూర్‌ వ్యాఖ్యలను నడిగర్‌ సంఘం నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. నడిగర్‌ సంఘం నుంచి మన్సూర్‌ను తాత్కాలికంగా ఎందుకు బహిష్కరించకూడదు? అనే దిశగా నడిగర్‌ సంఘం చర్చలు జరుపుతున్నట్లుగా ప్రెసిడెంట్ నాజర్ చెప్పుకొచ్చారు.

Nadigar Sangam: మన్సూర్‌ అలీఖాన్‌ను ఎందుకు బహిష్కరించకూడదు?
Nasser and Mansoor Ali Khan

హీరోయిన్‌ త్రిష (Heroine Trisha)ను ఉద్దేశించి కోలీవుడ్‌ విలన్‌, విలక్షణ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan) వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో మన్సూర్‌ వ్యాఖ్యలను నడిగర్‌ సంఘం (Nadigar Sangam) నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. నటి త్రిష కూడా మన్సూర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయబోనని ప్రకటించారు. ఈ మేరకు ఆమె శనివారం రాత్రి ఓ ట్వీట్‌ చేశారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన చిత్రం ‘లియో’. త్రిష హీరోయిన్‌, మన్సూర్‌ ఓ చిన్న పాత్రను పోషించారు.

ఇటీవల మన్సూర్‌ విలేకరులతో మాట్లాడుతూ... ‘గతంలో ఎన్నో చిత్రాల్లో బెడ్ సీన్లలో నటించాను. ‘లియో’లో నటించే అవకాశం రావడంతో త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని భావించా. చివరకు షూటింగ్‌ సమయంలో కనీసం ఆమెను చూపించలేదు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇవి త్రిష దృష్టికి వెళ్లడంతో ఆమె మండిపడ్డారు. ‘మన్సూర్‌ అలీఖాన్‌ నన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దేవుడి దయవల్ల ఇలాంటి క్రూర స్వభావం కలిగిన వ్యక్తితో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తితో కలిసి పనిచేయను’ అని పేర్కొన్నారు. అదే సమయంలో త్రిషను ఉద్దేశించి మన్సూర్‌ చేసిన వ్యాఖ్యలను ‘లియో’ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, నటి మాళవికా మోహనన్‌, గాయని చిన్మయి వంటి అనేక మంది ప్రముఖులు ఖండించారు. అలాగే, నడిగర్‌ సంఘం కూడా స్పందించింది. (Mansoor Ali Khan and Trisha)

ఇది కూడా చదవండి- Trisha vs Mansoor Ali Khan: నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను, క్షమాపణ చెప్పను: మన్సూర్



Trisha.jpg

నటి త్రిష గురించి సీనియర్‌ నటుడు, దర్శకుడు, నిర్మాత మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan) కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌ (Nasser) పేర్కొన్నారు. ‘‘కామెడీ పేరుతో మరో వ్యక్తిని కించపరిచేలా మాట్లాడిన మన్సూర్‌.. బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా మీడియాతో మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ మీడియా ముందు అయితే అలా మాట్లాడారో.. అదే మీడియా ముందు త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను నడిగర్‌ సంఘం నుంచి తాత్కాలికంగా ఎందుకు బహిష్కరించకూడదు (Ban)? అని నడిగర్‌ సంఘం భావిస్తోంది. భవిష్యత్తులో ఇతర నటీనటులు మీడియా ముందు మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలి’’ అని నాజర్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే విషయంపై టాలీవుడ్‌లోనూ త్రిషకు సపోర్ట్ లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నితిన్ (Nithin) వంటి వారంతా త్రిషకు మద్దతు తెలుపుతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Payal Rajput: బోల్డ్ మూవీ అంటున్నారు కానీ.. సినిమా చూస్తేనే అందులో ఉందేంటో తెలుస్తుంది

*****************************

*Kaathal The Core: రెండు దేశాల్లో మమ్ముట్టి, జ్యోతికల చిత్రం బ్యాన్.. ఎందుకంటే?

*******************************

*Dil Raju: మా ఆవిడ చెప్పే వరకు తెలియదు.. మా 16 నెలల అబ్బాయికి ఆ పాట పెట్టాల్సిందే

*****************************

Updated Date - 2023-11-22T14:25:40+05:30 IST