Kollywood: కోలీవుడ్ మూవీలకు ‘తమిళ’ పేర్లు ఎక్కడ?
ABN , First Publish Date - 2023-07-28T23:06:53+05:30 IST
తమిళంలో నిర్మించే చిత్రాలకు మాతృభాషలో టైటిల్స్ పెట్టే వారు కరువయ్యారు. ఇపుడు వస్తున్న అనేక చిత్రాలకు దాదాపుగా ఆంగ్లంలోనే పేర్లు పెడుతున్నారు. ఇందులో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా మెజార్టీ హీరోలు తమ చిత్రాలకు ఇంగ్లీష్ పేర్లు పెడుతున్నారు. దీనిపై తమిళ ప్రేక్షకులు ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
తమిళంలో నిర్మించే చిత్రాలకు మాతృభాషలో టైటిల్స్ పెట్టే వారు కరువయ్యారు. ఇపుడు వస్తున్న అనేక చిత్రాలకు దాదాపుగా ఆంగ్లంలోనే పేర్లు పెడుతున్నారు. ఇందులో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా మెజార్టీ హీరోలు తమ చిత్రాలకు ఇంగ్లీష్ పేర్లు పెడుతున్నారు. జూలై నెల చివరి శుక్రవారం విడుదలయ్యే అన్ని చిత్రాల టైటిల్స్ ఆంగ్లంలోనే ఉన్నాయి. ‘డీడీ రిటర్న్స్’, ‘ఎల్జీఎం’, ‘లవ్’, ‘టెర్రర్’, ‘డైనోసర్స్’, ‘పిజ్జా-2’ అనే పేర్లు పెట్టారు. ఏ ఒక్క చిత్రానికి కూడా తమిళంలో పేరు లేకపోవడాన్ని భాషా ప్రియులు తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. (Tamil Movies)
సినిమా ఆడియో, ట్రైలర్ ఫంక్షన్లు జరిగే సమయంలో మాతృభాష గొప్పతనం గురించి ప్రసంగించే నిర్మాతలు సైతం తాము నిర్మించే చిత్రాలకు ఆంగ్లంలోనే పేర్లు పెట్టడం గమనార్హం. ఇటీవల ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి (RK Selvamani) మాట్లాడుతూ.. ‘తమిళ సినిమాల నిర్మాణంలో తమిళ కళాకారులకే అవకాశాలివ్వాలని’ కోరుతూ ఒక తీర్మానం కూడా చేశారు. అదేవిధంగా తమిళ చిత్రాలకు తమిళంలోనే పేర్లు పెట్టాలని మరో తీర్మానం కూడా చేస్తే బాగుండేదని, నిర్మాణ సంస్థలకు కూడా ఈ మేరకు ఆయన సలహా ఇచ్చి ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తమిళం, తమిళం అనే గొప్పలు చెప్పుకునే వారు సినిమాలకు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ (English Titles)ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా తమిళంలో టైటిల్స్ పెట్టే చిత్రాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని తమిళ నిర్మాతల మండలి ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విఙ్ఞప్తి చేయడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Kushi Title Song: విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ అదిరింది
**************************************
*Ajith Kumar: తమన్నా కోసం ట్రై చేయండి
*************************************
* Sai Dharam Tej: అభిమానులకు విన్నపం.. నాకిప్పుడు అంత ధైర్యం లేదు
*************************************
*Ileana: రెండు నెలలలోనే ఇంత మార్పా.. ఇలియానా ఇప్పుడెలా ఉందో చూశారా?
**************************************
*Anuj Gurwara: పాటలు పాడుకోకుండా.. ఎందుకయ్యా నీకీ భజన?
**************************************
*Rajasekhar: ‘గబ్బర్‌సింగ్’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..
**************************************