Raghava Lawrence: ఆడియో ఫంక్షన్లకు అభిమానులు రావొద్దు.. లారెన్స్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-10T11:08:42+05:30 IST
తన చిత్రాల ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుకలకు తన అభిమానులను రావొద్దని హీరో, నిర్మాత, దర్శకుడు రాఘవ లారెన్స్ కోరారు. ఇలాంటి వేడుకలకు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, సమయాన్ని వృథా చేసుకుని రావడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. దీపావళికి విడుదలకాబోతోన్న సందర్భంగా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు.
తన చిత్రాల ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుకలకు తన అభిమానులను రావొద్దని హీరో, నిర్మాత, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కోరారు. ఇలాంటి వేడుకలకు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, సమయాన్ని వృథా చేసుకుని రావడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య నటించిన తాజా చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX). దీపావళి (Diwali)కి విడుదలకానుంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ... ‘‘తెలుగులో ఓ చిత్రం చేస్తుండటంతో ‘జిగర్తాండ’ తొలి భాగంలో నటించలేకపోయా. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. టీవీలో వచ్చినపుడల్లా ఈర్ష్య చెందేవాడిని. మంచి చిత్రంలో నటించలేకపోయాననే బాధ ఉండేది. ఇపుడు రెండో భాగంలో నటించే అవకాశం లభించింది. ఇక అభిమానులు విలువైన సమయాన్ని వారి కుటుంబ సభ్యుల కోసం వెచ్చించాలన్నదే నా అభిమతం. నా చిత్రం విజయవంతం కావాలని వారివారి ఇళ్లలోనే ఐదు నిమిషాలు ప్రార్థన చేయండి చాలు. వారు ఆదరించడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా. నాతో ఫొటో దిగాలని భావిస్తే, వారి ఇళ్లకే వెళ్తా’’ అని లారెన్స్ వెల్లడించారు. (Jigarthanda DoubleX Press Meet)
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ... ‘‘తొలి భాగం కథకు దీనికి సంబంధం లేదు. మదురై బ్యాక్‌డ్రాప్‌లో 1975లో జరిగే కథ. లారెన్స్, సూర్య ఇద్దరూ పోటీపడి నటించారు. నా సినీ కెరీర్‌లో ‘జిగర్తాండ’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం ఉంటుందని తెలుపగా.. ఎస్‌జే సూర్య (SJ Suryah) మాట్లాడుతూ... ‘కార్తీక్ ఒక దర్శకుడు కంటే మంచి మనసున్న మనిషి’ అన్నారు. అలాగే చిత్రంలోని పాటల్లో ‘మామధుర’ అనే లిరికల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, నిర్మాత కార్తికేయన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
============================
*Lokesh Kanagaraj: ఆ డైలాగ్ వివాదానికి పూర్తి బాధ్యత నాదే!
*******************************
*Kangana Ranaut: నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.. కానీ?
******************************
*Sreeleela: కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో ఉండేదాన్ని..
************************************
*Chiranjeevi: మీ మాటను వెనక్కి తీసుకోవాలి.. సినీ జర్నలిస్ట్‌ను కోరిన చిరు!
**********************************
*NBK: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌లో చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది.. అదంతా దాచి పెట్టాం!
*************************************