Udhayanidhi Stalin: తల్లి, భార్య సమక్షంలో.. ఉదయనిధి సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2023-06-03T21:13:52+05:30 IST

తమిళ నాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ చిత్ర ఆడియో వేడుకలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలు చేసేదే లేదని తెలుపుతూ.. దర్శకుడు మారి సెల్వరాజ్ కనుక మంచి కథతో వస్తే మాత్రం.. మళ్లీ మూడేళ్ల తర్వాత నటిస్తానని ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన తన ఫ్యామిలీ సమక్షంలో

Udhayanidhi Stalin: తల్లి, భార్య సమక్షంలో.. ఉదయనిధి సంచలన నిర్ణయం
Udhayanidhi Stalin

‘మామన్నన్‌’ (Maamannan) వంటి ఓ మంచి చిత్రమే తన చివరి సినిమా. కానీ, మారి సెల్వరాజ్‌ (Maari Selvaraj) తనను హీరోగా మరో చిత్రం డైరెక్ట్‌ చేస్తానంటే మూడేళ్ళ తర్వాత నటిస్తానని హీరో ఉదయనిధి (Udhayanidhi) ఆయన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ఉదయనిధి హీరోగా, మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో, కీర్తి సురేష్‌ (Keerthy Suresh) హీరోయిన్‌‌గా.. వడివేలు (Vadivelu), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మామన్నన్‌’. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ చిత్రం ఆడియోను తాజాగా చెన్నై నగరంలో విడుదల చేశారు. విశ్వనటుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) ముఖ్య అతిథిగా హాజరుకాగా.. హీరోలు శివకార్తికేయన్‌, విజయ్‌ ఆంటోని, సూరి.. దర్శకులు వెట్రిమారన్‌, పా.రంజిత్‌, ఏఎల్‌.విజయ్‌.. నిర్మాతలు కలైపులి థాను, కేఆర్‌, కె.రాజన్‌, ఎన్‌.మురళి వంటి అనేక మంది సినీ రంగ ప్రముఖులతో పాటు సీఎం స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్‌, కోడలు కృతికా ఉదయనిధి, అల్లుడు శబరీశన్‌ తదితరులు హాజరయ్యారు. (Maamannan Audio Launch)

ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మాట్లాడుతూ... ఇలాంటి ఒక మంచి చిత్రం నా చివరి సినిమా కావడం చాలా సంతోషంగా ఉంది. అయితే, మారి సెల్వరాజ్‌ మంచి కథతో వస్తే మూడేళ్ల తర్వాత మరో చిత్రంలో నటిస్తా. నా మూవీకి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (A. R. Rahman) తొలిసారి సంగీతం అందించారు. ఇందులో హీరో నేను కాదు. వడివేలు. ఆయనే ‘మామన్నన్‌’. కమల్‌ హాసన్‌ నిర్మించే చిత్రంలో నేను నటించాల్సి ఉంది. కానీ, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమాల్లో నటించడం భావ్యం కాదు. నా వరకు ఇదే చివరి చిత్రమని అన్నారు.

Maamannan.jpg

కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. మా బ్యానరులో సినిమా చేస్తానని ఉదయనిధి మాటిచ్చారు. అది కార్యరూపం దాల్చలేదు. నేను ఈ సినిమా చూశా. వడివేలు జీవించారు. ఇది మారి సెల్వరాజ్‌ రాజకీయ సినిమా. ప్రస్తుత సమాజానికి కావాల్సిన మూవీ. దీన్ని చూశాక ప్రతి ఒక్కరిలో ప్రశ్నించాలన్న ఆలోచన తప్పకుండా వస్తుందని భావిస్తున్నానని తెలపగా.. చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్‌ మాట్లాడుతూ.. శివాజీగణేశన్‌, కమల్‌ హాసన్‌ నటించిన ‘దేవర్‌ మగన్‌’ (Thevar Magan) చిత్రంలోని ఇసైక్కి పాత్రే ఈ ‘మామన్నన్‌’. కమల్‌ హాసన్‌కు ఒక ‘దేవర్‌ మగన్‌’, నాకు ‘మామన్నన్‌’. ఉదయనిధికి నచ్చని కథని చెప్పా. కానీ, ఆయన ఈ కథే సినిమా చేద్దామని ముందుకు వచ్చారు. ఆయన ధైర్యానికి, పరిపక్వతకు హ్యాట్సాఫ్‌.. అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Megastar Chiranjeevi: అలా క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకున్నా.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన మెగాస్టార్!

*Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలుసా?

*Varun-Lavanya: కొడుకు పెళ్లి వార్తలపై నాగబాబు అలా!.. సోషల్ మీడియాలో వరుణ్ ఇలా!

*PedaKapu1: ‘పెదకాపు1’.. శ్రీకాంత్ అడ్డాల ఈసారి డైరెక్ట్ అటాక్

*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!

Updated Date - 2023-06-03T21:13:52+05:30 IST