Leo OTT Release: ఓటీటీలోకి లియో.. ఫ్యాన్స్ కు ఇక పండగే
ABN , First Publish Date - 2023-10-27T13:53:50+05:30 IST
దసరా పండుగ సందర్భంగా విడుదలైన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్(Vijay) చిత్రం 'లియో'(Leo) అతి త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఎల్‌సీయూలో భాగంగా భారీ అంచనాల మధ్య భగవంత్ సింగ్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో పోటీగా అక్టోబర్ 19న వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వివరాలు బయటకు వచ్చాయి.
దసరా పండుగ సందర్భంగా విడుదలైన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్(Vijay) చిత్రం 'లియో'(Leo) అతి త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఎల్‌సీయూలో భాగంగా భారీ అంచనాల మధ్య భగవంత్ సింగ్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో పోటీగా అక్టోబర్ 19న వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డుల వైపు దూసుకెళుతున్నది. అన్ని భాషలలో కన్నా తెలుగులో ముందుగా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది.
అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వివరాలు బయటకు వచ్చాయి. థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాత సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకునేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముందే నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 'లియో'(Leo) సినిమాను నెల రోజుల లోపే నవంబర్ 21న దీపావళి కానుకగా ఓటీటీ(OTT)లోకి తీసుకురానున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీపై సదరు సంస్థ అధికారికంగా ఓ ప్రకటన చేయనుంది.
లోకి ఎల్‌సీయూ యూనివర్స్‌లో భాగంగా 'ఖైదీ, విక్రమ్' అనంతరం వచ్చిన ఈ సినిమా వాటి రేంజ్‌లో లేదంటూ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ యాక్షన్, హైనా సీన్స్, విజయ్ నటనతో జనం థియేటర్లకు లైన్ కట్టారు. దీంతో ఈ సినిమా ఆరు రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మొట్టమొదటి తమిళ చిత్రంగా 'లియో' రికార్డులకెక్కింది. ఈ సినిమా అనంతరం విజయ్ వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో సినిమా తీస్తుండగా, లోకేశ్ కనగరాజ్ రజనీకాంత్ 171 సినిమాకు దర్శకత్వం చేయనున్నాడు.