Vishal : ప్రజల తీర్పే నిజమైన అవార్డు...
ABN , First Publish Date - 2023-09-03T10:51:01+05:30 IST
హీరో విశాల్ (Vishal) అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న అవార్డుల తీరుపై ఎలాంటి నమ్మకం (Comments on Awards) లేదని కామెంట్ చేశారు. విశాల్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘మార్క్ ఆంటోని’ (Mark Antony) చిత్రం వినాయకచవితి సందర్భంగా ఈ నెల 15న సినిమా విడుదల కానుంది
హీరో విశాల్ (Vishal) అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న అవార్డుల తీరుపై ఎలాంటి నమ్మకం (Comments on Awards) లేదని కామెంట్ చేశారు. విశాల్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘మార్క్ ఆంటోని’ (Mark Antony) చిత్రం వినాయకచవితి సందర్భంగా ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో జాతీయ అవార్డులకు సంబంధించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విశాల్ సమాధానమిచ్చారు. ‘‘అవారులపై నాకు అస్సలు నమ్మకం లేదు. సినిమా చూసి, అందులో ఆర్టిస్ట్ నటనకు ప్రజలందరూ కలసి ఇచ్చేదే గొప్ప అవార్డు. నిజాయతీగా వచ్చే అవార్డ్ అంటే ప్రేక్షకులు ఇచ్చే తీర్పే. ప్రేక్షకుల ఆశీస్సులతో ఇన్నేళ్లగా సినీరంగంలో నిలదొక్కుకుంటూ చిత్రాల్లో నటిస్తున్నా. అదే నాకు పెద్ద అవార్డుగా భావిస్తా. ఒకవేళ నేను నటించిన చిత్రాలకు అవార్డు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తాను’’ అని విశాల్ అన్నారు.
పొలిటికల్ ఎంట్రీ, ఎలక్షన్లకు గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘జీవితంలో ఏదైనా జరగొచ్చు. ఒకప్పుడు ఆరిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్) సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాధారవి నన్ను సంఘం సభ్యుడిగా చేరమని చాలాసార్లు అడిగారు. ఆయన మాటతోనే చేరాను. కొంత కాలానికి అదే సంఘంలో ఆయనకు పోటీగా ఎన్నికల్లో దిగి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందా. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. మన చేతుల్లో ఏమీ లేదు’ అని చెప్పారు.