Keerthi Suresh: మీ షర్టు వేసుకుంటానని హీరోని అడిగేశా..
ABN , First Publish Date - 2023-07-15T11:09:06+05:30 IST
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామన్నన్’. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ‘నాయకుడు’ పేరుతో తెలుగులోనూ ఈ శుక్రవారం విడుదలైంది. టాలీవుడ్‌లో ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి కీర్తి సురేష్ సంతోషం వ్యక్తం చేసింది.
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామన్నన్’ (Maamannan). మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ‘నాయకుడు’ (Naayakudu) పేరుతో తెలుగులో తాజాగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూనిక్ ఇంటెన్స్ కంటెంట్‌తో ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
ఆమె మాట్లాడుతూ..
‘మామన్నన్’ తమిళంలో గొప్ప విజయం సాధించింది. ఈ సినిమాలో ఓ కామన్ ఎమోషన్ వుంది. ఆ ఎమోషన్ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పని చేయాలని ప్రతి హీరోయిన్‌కు కోరిక వుంటుంది. ఆయన కథలో అమ్మాయిలకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. ఆయన కథ చెప్పినపుడు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అయితే ఆయన చెప్పినదాని కంటే నాలుగు రెట్లు గొప్పగా ఈ సినిమా తీశారు. చిన్నగా మొదలైన గొడవ అది ఎంతకి దారితీస్తుందని చాలా బ్రిలియంట్‌గా చూపించారు. ఈ ఎమోషన్‌కి ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం సంతోషాన్ని ఇచ్చింది.
ఈ సినిమా కోసం నాకు ముందుగానే లుక్ టెస్ట్ చేయలేదు. సింపుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్‌ని అద్భుతంగా రాసుకున్నారు దర్శకుడు మారి. మాములుగా జీన్స్ షర్టు షూ వేసుకునే ఓ మామూలు అమ్మాయిని. షూటింగ్‌కి గంట ముందు లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. మీరు గమనిస్తే ఉదయనిధి గారిది, నాది ఒకే డ్రెస్ స్టయిల్ వుంటుంది. ‘నాకు షర్టు లేకపోతే మీ షర్టు వేసుకోవచ్చు కదా అని ఆయనతో సరదాగా అన్నా (నవ్వుతూ)’. ఈ సినిమా చూసిన కొందరు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి మీ డ్రెస్సింగ్ బావుందండి అని చెప్పారు. అలా సింపుల్‌గా కాజువల్‌గా వుండటం వారికి కనెక్ట్ అయ్యింది.
ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చాలా ఫన్ పర్సన్. ఆయనలో చాలా హ్యుమర్ వుంటుంది. సెట్స్‌లో చాలా జాలీగా వుంటారు. ఈ సినిమా ఎంత ఇంటెన్స్‌గా వుంటుందో దానికి పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వం ఆయనది. చాలా సరదాగా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వడివేలు (Vadivelu)గారు అద్భుతమైన యాక్టర్ . ఆయన ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలి. హాస్యమే కాదు ఇలాంటి సీరియస్ రోల్స్ కూడా ఆయన అద్భుతంగా పండిస్తారు. రెహమాన్ (A.R Rahman) గారి గురించి చెప్పాలి. ఆయన ఇచ్చిన ఆర్ఆర్ ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ. థియేటర్‌లో ఆడియన్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అందుకు కారణం ఆయనే. వడివేలుగారికి చేసిన పాట, అలాగే నేను, ఉదయ్ గారు చేసిన పాటకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. కమ్యూనిజం నేపధ్యంలో వచ్చే పాట, అందులో డ్యాన్స్‌ని ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదించడం ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం తమిళ్‌లో ‘సైరన్, రఘు తాత, రివాల్వర్ రీటా’ చిత్రాలు చేస్తున్నాను. తెలుగులో చిరంజీవిగారి ‘భోళా శంకర్’ (Bholaa Shankar)లో ఆయనకి చెల్లెలిగా చేశాను. ఈ సినిమా ఆగస్ట్ 11న వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
**************************************
*Sai Dharam Tej: పవన్ మామయ్య.. నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు
**************************************
*Honey Rose: మాములుగా చూస్తేనే తట్టుకోలేరు.. హనీ రోజ్ ఇలా కనిపిస్తే కష్టమే!
**************************************
*Hit2 Max: మాక్స్‌కు.. ‘హిట్2’ యూనిట్ కన్నీటి వీడ్కోలు
**************************************
*AR Rahman: నేను రామ్‍చరణ్ RC16కు పని చేస్తున్నా..
**************************************
*MS Dhoni: నా భార్య సినిమా అన్నప్పుడు.. నేను తనతో ఒకే మాట చెప్పా..
**************************************
*Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?
**************************************