Prem Kumar: పెళ్లి ఆగిపోయినప్పుడు పెళ్లి కొడుకు పడే బాధే.. ప్రేమ్ కుమార్ సినిమా
ABN , First Publish Date - 2023-08-15T22:26:58+05:30 IST
సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి ఆగిపోయినప్పుడు పెళ్లి కూతురు బాధపడటం అందరికీ తెలుసు.. కానీ పెళ్లి కొడుకుకి ఆ పరిస్థితి వస్తే అనేదే ప్రేమ్ కుమార్ సినిమా అని తెలిపారు.
సంతోష్ శోభన్ (Santosh Soban) హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’ (Prem Kumar). సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు (Shiva Prasad Panneeru) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. 10 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉంటున్నాను. సాధారణంగా బిజినెస్ రంగానికి, సినీ రంగానికి చాలా తేడా ఉంది. ఎంటైర్ సినీ జర్నీలో క్రియేటివ్ థాట్స్‌కి, బిజినెస్‌కి చాలా తేడాలుంటాయి. వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ ముందుకు పోవాలని నాకు అర్థమైంది. నిర్మాతగా ఈ జర్నీ నాకెంతో సంతోషాన్నిచ్చింది. నిర్మాతగా ‘ప్రేమ్‌కుమార్’ నా తొలి సినిమా. పరిమితమైన బడ్జెట్‌లో మంచి ఎంటర్‌టైన్మెంట్ మూవీ చేయాలని అనుకున్నాను. చేశాను. సంతోష్ కూడా ఎప్పుడు ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా చేయలేదు. అందుకనే ఈ కథను సెలక్ట్ చేసుకున్నాం. పెళ్లి అనేది స్క్రిప్ట్‌లో ఓ భాగం మాత్రమే. సంతోష్ శోభన్, అభిషేక్ నాకు చాలా మంచి స్నేహితులు. వారి కోసం ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పటికీ సబ్జెక్ట్‌లో దమ్ము కనిపించింది. అందుకనే ముందు అనుకున్న బడ్జెట్ కంటే కథ డిమాండ్ మేరకు కాస్త ఎక్కువ బడ్జెట్టే అయ్యింది. బేసిగ్గా నేను చాలా సాఫ్ట్ పర్సన్. ఏదైనా సమస్య వస్తే అరిచి గొడవపడటం చేయను. ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతుందని నమ్ముతాను. సమస్య మనకు అర్థమైతే పరిష్కారం సులభంగా తెలిసిపోతుంది. ఈ సినిమా విషయానికి వస్తే మా మధ్య గొడవలేం జరగలేదు. క్రియేటివ్ జర్నీలో అభిప్రాయ భేదాలనేది సాధారణంగా జరుగుతుంటాయి. స్నేహితులం కాబట్టి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాం. నిర్మాతగా నా తొలి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. (Producer Shiva Prasad Panneeru Interview)
ఈ సినిమా కంటే ముందు దాదాపు 30-35 కథలు విన్నాం. హీరో, దర్శకుడు ఎవరనేది ముందుగానే ఫిక్స్ అయ్యాం. దాని మీదనే ఫస్ట్ నుంచి వర్కవుట్ చేసుకుంటూ వచ్చాం. చాలా విశ్లేషణలు తర్వాత ‘ప్రేమ్ కుమార్’ కథ అయితే సరిపోతుందనిపించింది. ఎందుకంటే సాధారణంగా మన సినిమాల్లో హీరో హీరోయిన్ పెళ్లి సమయంలో పారిపోవటమో, ఫైట్ చేసి కలిసిపోవటమో జరుగుతుంటుంది. అది ఎక్కువగా హీరో హీరోయిన్స్ కోణంలోనే చూపిస్తూ వచ్చారు. మరి పెళ్లి పీటల మీదున్న పెళ్లి కొడుకు పాయింట్‌ను ఎవరూ చూపించలేదు. ఉన్నా ఏ ఒకట్రెండు సినిమాల్లోనే చూసుంటారు. ఆ పాయింట్ నాకు ఆసక్తికరంగా అనిపించింది. పెళ్లి ఆగిపోయినప్పుడు ఆ యువకుడు మానసికంగా ఎలాంటి బాధను అనుభవిస్తాడు. అతని కుటుంబానికి వచ్చే సమస్యలు ఏంటి? అనే దాన్ని ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్‌లో చూపించాం.
హీరో సంతోష్ శోభన్ బ్రిలియంట్ యాక్టర్. తను భవిష్యత్తులో చాలా పెద్ద హీరో అవుతాడు. ప్రతీ నటుడికి ఓ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నాకు తెలిసి ఈ ‘ప్రేమ్ కుమార్’ సినిమా తన బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే సినిమా. అతని కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. మేం నా ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులతో కలిసి సినిమా చూశాం. అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. హీరోయిన్స్ రాశీ సింగ్, రుచిత సాధినేని అద్భుతంగా నటించారు. దర్శకుడు అభిషేక్ వీరిద్దరినీ సెలక్ట్ చేసుకున్నారు. ప్రభావతిగారు, అశోక్‌గారు ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను మనం లైవ్‌లో చూసినట్లే అనిపిస్తుంది. స్నేహితుల కోసమే సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను స్టార్ట్ చేశాను. మా గ్రూపులోనే 10 -12 మంది ఉన్నారు. వారిలో డైరెక్టర్స్, రైటర్స్ ఉన్నారు. అందరికీ ఓ బేస్ కావాలని స్టార్ట్ చేశాం. లాక్ డౌన్ సమయంలో మా టీమ్‌తో కలిసి 40 కథలను సిద్ధం చేశాం. అందులో 10 కథలు బౌండెడ్ స్క్రిప్ట్స్‌తో రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జోనర్ మూవీస్‌లో సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. (Producer Shiva Prasad Panneeru About Prem Kumar)
ఇవి కూడా చదవండి:
***************************************
*Klin Kaara Konidela: ఫస్ట్ ఇండిపెండెన్స్ డే.. జెండా ఆవిష్కరించిన క్లీంకార
***************************************
*Vishwak Sen: ఊహించిందే జరిగింది.. పెళ్లి లేద్.. ఏం లేద్..
***************************************
*The Soul Of Satya: సాయిధరమ్ తేజ్, స్వాతి.. జీవించేశారు
***************************************
*Bhagavanth Kesari: బాలయ్య విలన్ పని అయిపోయింది
***************************************
*The Vaccine War: అన్ని మాటలు చెప్పారు.. ‘సలార్’కి పోటీగానే దింపుతున్నారుగా..
***************************************