Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ భామకు ఆ తరహా పాత్రలు చేయాలనుందట..
ABN , First Publish Date - 2023-10-23T16:09:19+05:30 IST
ఎప్పుడూ న్యూలుక్‌లో.. మోడర్న్‌గాళ్‌గా ఉండటం ఇష్టం. ఇన్‌స్టాలో, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సినిమాలకంటే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటా. నా నిజ జీవితం కనపడుతుంది. 20 లక్షల మంది ఇన్‌స్టా ఫాలోయర్స్ ఉన్నారు. సినిమాల్లోకి వస్తాను.. ఇంత ఫేమ్ సాధిస్తానని అనుకోలేదు. నెగిటివ్ రోల్స్‌లో చేయాలన్నదే నా డ్రీమ్.. అని తాజాగా షాలిని పాండే చెప్పుకొచ్చింది.
ఎప్పుడూ న్యూలుక్‌లో.. మోడర్న్‌గాళ్‌గా ఉండటం ఇష్టం. ఇన్‌స్టాలో, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సినిమాలకంటే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటా. నా నిజ జీవితం కనపడుతుంది. 20 లక్షల మంది ఇన్‌స్టా ఫాలోయర్స్ ఉన్నారు. సినిమాల్లోకి వస్తాను.. ఇంత ఫేమ్ సాధిస్తానని అనుకోలేదని అంటోంది షాలిని పాండే (Shalini Pandey). ప్రేక్షకులకు షాలిని పాండే అంటే తెలియదేమో.. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) చిత్రంలో ప్రీతి (Preethi) అంటే బాగా గుర్తుంటుంది. ఇన్‌స్టాలో రెండు మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఈ అమ్మడు ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. షాలినీ పాండే గురించి మరికొన్ని విషయాలు..
చిన్నప్పుడు...
మాది మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్. చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి డ్యాన్స్‌లేసేదాన్ని. కరీనాకపూర్ డైలాగ్స్ కొట్టేదాన్ని. కాఫీ విత్ కరణ్ జోహార్ లాంటి కార్యక్రమాలు బాగా చూసేదాన్ని. వాస్తవానికి చిన్నప్పుడే వేషధారణ, తీరు.. అంతా సినిమాటిక్‌గా ఉండేది. ఇకపోతే ఇంట్లో మా నాన్నకు సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. గ్రాడ్యుయేషన్ తర్వాతనే ఏదైనా అనేవారు. బిటెక్ చదివేప్పుడు నాటకాల్లో శిక్షణ తీసుకున్నా. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ముంబైకి వెళ్లాను. ఆయనకు కోపం వచ్చింది. ‘అసలు ఇక్కడికి రావొద్దు’ అన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి సంతకం చేశా. ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయి’ అన్నారు. అయినా నేను వినలేదు. ముంబైలో కష్టాలు పడ్డా. అయితే మిత్రుల సహకారం మరువలేనిది. ‘అర్జున్‌రెడ్డి’ ప్రీమియర్ చూశాక.. నాన్న మెచ్చుకున్నారు. వేరే ఆప్షన్ తీసుకోను.. యాక్టింగ్ తప్ప! అని చెప్పాను. మా నాన్న నేపథ్యం ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి... నన్ను కూడా ఆఫీసుకు వెళ్తే బావుంటుందనేవారు. నాకేమో ఆఫీసు ఉద్యోగం నచ్చలేదు. మొత్తానికి.. యాక్టింగ్ పట్ల నా ప్యాషన్ ఏంటో అప్పుడే ఇంట్లో వారందరికీ నచ్చింది. (Shalini Pandey Interview)
అలా క్రేజ్ వచ్చింది..
‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy Movie)తో మంచి పేరు వచ్చింది. ‘బేబీ’ అంటూ.. ‘ప్రీతి’ అంటూ ఎన్నో మెసేజ్‌లు ప్రతిరోజూ వచ్చాయి. ప్రీతి పాత్రకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ క్రేజ్‌తో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘మహానటి’, ‘ఎన్టీయార్ కథానాయకుడు’, ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’.. ఇన్ని చిత్రాలు తెలుగులో చేసినా ఇంకా.. ‘ప్రీతి’గా నన్ను గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. అంటే ఆ పాత్ర తీరు.. ఆ సినిమా క్రేజ్ అలాంటిది. తమిళంలో కూడా మూడు చిత్రాల్లో నటించా. గతేడాది రన్‌వీర్ సింగ్‌తో కలసి హిందీలో ‘జయేష్‌భాయ్ సర్దార్’ చిత్రంలో నటించా. ప్రస్తుతం ‘మహారాజా’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నా. (Shalini Pandey Movies)
అందువల్లనే ఇలా...
కచ్చితంగా ఇలా ఈ రోజు ఉన్నానంటే.. సినిమా మీద ఉండే ప్రేమ. సక్సెస్ వచ్చినా.. కథానాయిక అయినా సాధారణంగా ఉంటా. కమల్‌హాసన్, అమితాబ్ గారి సినిమాల్లో ఐదు నిముషాలు కనపడినా చాలు అనుకుంటా. అంతలా వారి నటనను ఇష్టపడతా. మిరాకిల్స్ జరగవు.. అనుకునేదాన్ని. అర్జున్‌రెడ్డి సినిమాతో జీవితంలో ఓ మిరాకిల్ జరిగింది. నాకు డ్రీమ్ అంటే నెగటివ్‌రోల్‌లో నటించాలన్నదే నా డ్రీమ్. అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ తరహా పాత్ర (నెగిటివ్ రోల్) చేయడానికి సిద్ధంగా ఉన్నాను..(Shalini Pandey Wants Negative Roles)
ఇవి కూడా చదవండి:
============================
*Prabhas: శత శతమానం భవతి.. ‘కన్నప్ప’ టీమ్ గ్రాండ్‌గా విషెస్
****************************************
*Dhanraj: దర్శకుడిగా ధనరాజ్.. స్టార్ యాక్టర్‌తో సినిమా ప్రారంభం
*****************************************
*Poonam Kaur: నేను కూడా ‘జై బాలయ్య’ బ్యాచ్‌లోకి చేరాలనుకుంటున్నా..
********************************************