Khushi director: 'ఖుషి’ లో హిందూ ముస్లిం మధ్య గొడవలు చూపించడం లేదు
ABN , First Publish Date - 2023-08-29T18:13:19+05:30 IST
భావోద్వేగాలను, కొంచెం ఎంటర్ టైనమెంట్ తో జతచేసి సరికొత్తగా తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన ఇంతకు ముందు చేసిన 'నిన్ను కోరి', 'మజిలీ', 'టక్ జగదీశ్' సినిమాలు సకుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత జంటగా అతను రూపొందించిన కొత్త సినిమా ‘ఖుషి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన తన అనుభవాలను తెలిపారు దర్శకుడు శివ నిర్వాణ
సినిమా గురించి మాట్లాడుతూ, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సమస్యలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి అని చెపుతూ, ఈ సినిమాలో టైటిల్ కు తగినట్లుగా ఎంటర్ టైన్ మెంట్ తో కథను చెప్పాలని అనుకున్నాను అని చెప్పాడు శివ. ట్రైలర్ లో ఎంటర్ టైన్ మెంట్ తో ఉన్న సీన్స్ వున్నాయి కదా, అవన్నీ థియేటర్ లో చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి అని చెప్పాడు ఈ కథని 'డియర్ కామ్రేడ్' #DearComrade సినిమా తర్వాత విజయ్ (VijayDeverakonda) కి చెప్పాను. కథ చెప్పిన ఏడాదిన్నర తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది, ఎందుకంటే విజయ్ 'లైగర్' #Liger సినిమాలో బిజీగా ఉన్నారు. నేను 'నిన్నుకోరి' #NinnuKori, 'మజిలీ' #Majili, 'టక్ జగదీశ్' చేసిన తర్వాత ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీ చేయాలని అనుకున్నాను, కానీ విజయ్ ని కలిసినప్పుడు 'ఖుషి' #Khushi కథ పాయింట్ గా చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది అని వివరించాడు దర్శకుడు శివ నిర్వాణ.
ఈ సినిమా మణిరత్నం (ManiRatnam) ‘సఖి’ #Sakhi లాంటి పాయింట్ లా వుంది అన్నప్పుడు, శివ అది వేరు ఇది వేరు అని చెపుతూ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది అన్నాడు. ఇవాళ్టి కాంటెంపరరీ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను విజయ్, సమంత (Samantha) లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా అడ్రస్ చేయిస్తే బాగుంటుందని నమ్మాను. వాళ్లకూ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఆ పాయింట్ ఏంటనేది ట్రైలర్ లో మేము చూపించలేదు. థియేటర్ లో చూడాలి అని చెప్పాడు. (ShivaNirvana)
గతంలో చేసిన సినిమాలు 'నిన్నుకోరి', 'మజిలీ'లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ఉంటే, ఈసారి ఒక ఎంటర్ టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమ కథను రూపొందించాలని అనుకున్నాను అని చెప్పాడు వ్యక్తిగతంగా సరదాగా ఉండే పర్సన్ ని కావటంతో ఈ సినిమాకు సరదా అని, మరికొన్ని టైటిల్స్ అనుకున్నాను. కానీ విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా ‘ఖుషి’ టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ సినిమా విజయ్ తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సమంత లాంటి ఫర్ ఫార్మింగ్ హీరోయిన్ ఉంటే సినిమా మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఆమెను అడిగాం. ఈ సినిమాలో విజయ్ ను లేడీ ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు అని వివరించాడు.
ప్రేమ కథను ఎంత కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్. కథ రాసేప్పుడు సెకండాఫ్ రెడీ అయ్యింది. కానీ ఫస్టాఫ్ లో లవ్ స్టోరిని కాలేజీలో చూపించకుండా ఒక ఫీల్ గుడ్ ప్లేస్,ప్లెజంట్ గా ఉండే ప్లేస్ నుంచి మొదలుపెడితే బాగుంటుంది అనిపించింది. అలాగే లీడ్ పెయిర్ మధ్య పరిచయం ఫన్ తో సాగాలి అనుకున్నాను. మీరు ట్రైలర్ లో చూసినట్లు హీరో హీరోయిన్ ను బేగమ్ అని ఒకసారి, మరోసారి ఇంకోలా పిలుస్తుంటాడు. ఇవన్నీ సరదాగా ఉంటాయి. సమంత షూటింగ్ కోసం ఎంతో కోపరేట్ చేస్తుంది, ఆమె చాలా డెడికేటెడ్ యాక్ట్రెస్, అలాంటి ఆమెకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మేమంతా సపోర్ట్ చేయకుంటే ఎలా. ఆమె ట్రీట్ మెంట్ మధ్యలో వస్తా అని చెప్పేది కానీ మధ్యలో గ్యాప్ ఇస్తూ షెడ్యూల్స్ చేయడం ఇబ్బందిగా ఉండి, పూర్తిగా నయమైన తర్వాతే రమ్మని చెప్పాం అని సమంత గురించి చెప్పాడు దర్శకుడు.
ఇందులో పాటలన్నీ దర్శకుడు శివ నిర్వాణ రాసాడు. అది కేవలం ఆలా కుదిరింది అంటాడు. పాటల కోసం సంగీత దర్శకుడు హేషమ్ తో సిట్టింగ్స్ లో ఉన్నప్పుడు ఇద్దరికీ నచ్చిన ట్యూన్ రావడం లేదు. సినిమాలో కథానాయకుడుకి కాశ్మీర్ అంటే ఇష్టం, అలాగే మణిరత్నం సినిమాలను ప్రేమిస్తాడు. అప్పుడు నా రోజా నువ్వే, దిల్ సే నువ్వే, అంజలి, గీతాంజలి నువ్వే అని లిరిక్ రాసాడు శివ. దానికి హేషమ్ ట్యూన్ చేసి పాడాడు. అలా శివ ఏదో లైన్ రాయడం హేషమ్ ట్యూన్ కుదరడం జరిగింది. ఇదేదో బాగా వర్కవుట్ అవుతుందని అలా మొత్తం పాటలన్నీ చేశాం. ఇంతకు ముందు సినిమాలలో కూడా పాటలు రాసాడు శివ, కానీ తన తదుపరి సినిమా లిరిసిస్ట్ లతో కలిసి పనిచేస్తా, అలాగే అప్పుడు కుదిరితే తను కూడా రాస్తాను అని చెప్తున్నాడు.
విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ, అతనిలో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది అని చెప్పాడు. 'పెళ్లి చూపులు', 'గీత గోవిందం'లో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు, కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటారు. ‘ఖుషి’ లో హిందూ ముస్లిం మధ్య గొడవలు చూపించడం లేదు. కానీ ఒక వెరీ సెన్సిటివ్ ఇష్యూను కథలో చూపిస్తాం. అది మీకు నచ్చుతుంది. ఒక ప్లెజంట్ ఎట్మాస్పియర్ కోసమే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం అని వివరించాడు.
అలాగే కథానాయకురాలి సమంతను గురించి చెపుతూ, వింటేజ్ సమంత ని చూస్తారు అన్నాడు. ఆమె 'ఫ్యామిలీ మ్యాన్' వంటి డిఫరెంట్ జానర్స్ చేసింది, కానీ ఇప్పుడు ఇలాంటి లవ్ స్టోరిలో ఆమెని చూడటం మంచి ఫీల్ కలిగిస్తుంది. రెండేళ్లకో సినిమా చేస్తూ వచ్చా, కానీ మధ్యలో కోవిడ్ వచ్చింది. అప్పుడు కూడా కష్టపడి ఎలాగో 'టక్ జగదీశ్' కంప్లీట్ చేశాం. ఆ సినిమా థియేటర్ కోసం చేసిన సినిమానే కానీ ఓటీటీకి వెళ్లింది. థియేటర్ లో విడుదలైతే దాని ఫలితం ఎలా ఉండేదో తెలియదు, కానీ నేను మనసుపెట్టి చేసిన సినిమా అది అని చెప్పాడు శివ.
ఈ ‘ఖుషి’ సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు ఎలాంటి పోలికలు, సంబంధం లేదు అని చెప్పాడు. మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది, ఇంతకు ముందు ఆమెతో 'మజిలీ' సినిమా చేశాను కాబట్టి బాగా నటించగలదు అని ఇందులోకి తీసుకున్నాం. నేను రాసిన కథలో ఆమె తన క్యారెక్టర్ ప్లే చేసింది అంతే. శివ నిర్వాణం దర్శకుడు మణిరత్నం అభిమానిని అని చెప్పాడు, అందుకే ఆయన సినిమాలను బాగా ఇష్టపడతాను అని కూడా అంటున్నాడు. పరిశ్రమలోకి రావాలనుకున్నప్పుడు చెన్నై వెళ్లి ఆయన దగ్గర జాయిన్ అవ్వాలనుకున్నాడట, కానీ మణిరత్నం గారిని కలవడం కుదరలేదు. ఆయన సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను అలాగే మణిరత్నంలా ఒక్క ఫ్రేమ్ కూడా ఎవరూ పెట్టలేరు అని చెప్పాడు శివ. ఆయన సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతాము అని చెప్పాడు.
'బాహుబలి', 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'కార్తికేయ' వంటి సినిమాలన్నీ మనకు నచ్చేలా చేసుకున్న సినిమాలు. ఇతర భాషల వాళ్లు ఇష్టపడి పాన్ ఇండియా అయ్యాయి. నా దృష్టిలో మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుంది. పాన్ ఇండియాకు చేయాలని మనం ప్లాన్ ముందే చేసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం. ‘ఖుషి’ థియేటర్ లో చూసి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారు అని వివరించాడు.